కేంద్రం కీలక నిర్ణయం.. 12% GST శ్లాబ్‌లోని 99% వస్తువులకు 5% జీఎస్టీ

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుత జీఎస్టీ 12% – 28% శ్లాబులను తొలగించాలని కేంద్రం ప్రతిపాదిస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి.


కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించిన వస్తువులు మరియు సేవల పన్ను (GST)లో 5 శాతం, 18 శాతం పన్ను రేట్లను మాత్రమే ప్రతిపాదించిందని, ఈ సంవత్సరం దీపావళి నాటికి ప్రస్తుత పరోక్ష పన్ను విధానాన్ని భర్తీ చేయనున్నట్లు ఉన్నత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సున్నా శాతం GST పన్నును ముఖ్యమైన ఆహార పదార్థాలపై వసూలు చేస్తున్నారు. అలాగే రోజువారీ వినియోగ వస్తువులపై 5 శాతం, ప్రామాణిక వస్తువులపై 12 శాతం, ఎలక్ట్రానిక్, సేవలపై 18 శాతం, లగ్జరీ, సిన్ గూడ్స్‌పై 28 శాతం వసూలు చేస్తున్నారు.

పునరుద్ధరించిన GST విధానంలో రెండు శ్లాబ్‌లతో పాటు లగ్జరీ, సిన్ గూడ్స్‌కు 40 శాతం ప్రత్యేక రేటు ఉంటుందని వర్గాలు తెలుపుతున్నాయి. తాజాగా పునరుద్ధరించిన నిర్మాణాన్ని GST కౌన్సిల్ ఆమోదించినప్పుడు.. ప్రస్తుత 12 శాతం శ్లాబ్‌లోని 99 శాతం వస్తువులు 5 శాతం బ్రాకెట్‌కు మారుతాయని వారు తెలిపారు. అదేవిధంగా, ప్రస్తుతం 28 శాతం పన్ను విధించబడుతున్న దాదాపు 90 శాతం వస్తువులు, సేవలు 18 శాతం పన్ను రేటుకు మారుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నిర్ణయం సామాన్యులను ఊరటనిచ్చే అవకాశం కనిపిస్తుంది. కాగా ఈ నిర్ణయం దిపావళి కానుకగా ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం అందుతుండటా.. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.