ఏ బిడ్డకు అయినా తండ్రే సూపర్ హీరో. ముఖ్యంగా ఆడపిల్లలు నాన్న అంటేనే ఎక్కువ ఇష్టపడతారు. ఎవరైనా వేధిస్తే నాన్నతో చెప్పుకోవాలనుకుంటారు. కానీ నాన్నే వేధిస్తే..
లైంగిక దాడికి పాల్పడితే?.. ఈ కష్టాలను తట్టుకొని నిలబడింది సీనియర్ నటి ఖుష్భూ(Khushboo Sundar). పలు సందర్భాల్లోనూ తన తండ్రి వల్ల లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానంటూ బహిరంగంగా చెప్పింది. తాజాగా మరోసారి తన తండ్రి వల్ల ఆమె పడిన కష్టాలు, ఫ్యామిలీకి ఎదురైన సమస్యల గురించి బయటపెట్టింది. తనపై తండ్రి చేసిన లైంగిక దాడి బయటకు చెబితే ఎక్కడ ఇబ్బంది పెడతారోనని భయపడి చాలా కాలం దాచానని ఆమె చెప్పారు. కెరీర్ పరంగా బాగా సెట్ అయిన తర్వాత తండ్రిని ఎదురించానని చెప్పింది.
మా నాన్నతోనే నాకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. నా తల్లిని, సోదరులను దారుణంగా హింసించేవాడు. బెల్టు, చెప్పులు, కర్ర.. ఇలా ఏది దొరికితే దాడితో కొట్టేవాడు. చిన్నతనంలోనే నేను ఇలాంటి వేధింపులను చూశా. నాపై జరుగుతున్న లైంగిక వేధింపులు బయటకు చెబితే ఇంకెంత హింసిస్తారోనని భయపడి చెప్పలేదు. చెన్నైకి వచ్చి, నా కాళ్లపై నేను బతకడం ప్రారంభించిన తర్వాత నాలో ఆత్మస్థైర్యం పెరిగింది. ఆ తర్వాత కూడా మా నాన్న నన్ను వేధించాడు.
దీంతో నేను ఎదురు తిరిగాను .అది తట్టుకోలేక షూటింగ్ ప్రదేశానికి వచ్చి అందరి ముందు కొట్టేవాడు. ఉబిన్ అనే ఒక హెయిర్ డ్రెస్సర్ నాకు తోడుగా ఉండి ధైర్యం చెప్పింది. 14 ఏళ్ల వయసులో మా నాన్న చేసిన లైంగిక వేధింపుల గురించి బయటకు చెప్పాను. ఆ తర్వాత ఆయన మమ్మల్ని వదిలేసి వెళ్లాడు. ఆయన ఎక్కడి వెళ్లాడని కూడా మేము ఆరా తీయలేదు. ఎప్పుడు ఆయనను కలవలేదు. గతేడాది ఆయన చనిపోయాడని విషయం బంధువుల ద్వారా తెలిసింది. కానీ నేను మాత్రం ఆయనను చూసేందుకు కూడా వెళ్లలేదు’ అని ఖుష్భూ చెప్పింది.