నేడు అర్ధరాత్రి నుంచి కియా సైరోస్ బుకింగ్స్ ప్రారంభం

www.mannamweb.com


జనవరి రెండవ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి కియా కంపెనీ నుంచి కియా సైరస్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. రూ. 25000 టోకెన్ అమౌంట్ పే చేసి ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు కియా సైరస్ బుకింగ్ చేసుకోవచ్చు. అయితే ఫిబ్రవరి ఒకటవ తేదీన ఈ సబ్ కంపాక్ట్ ఎస్ యు వి ధరలను ప్రకటిస్తారు. ఫిబ్రవరి నెల మధ్యలో నుంచి ఈ కియా సైరస్ డెలివరీలు మొదలవుతాయని తెలుస్తుంది. కియా సైరస్ లో కియా లైనప్ లో సోనేట్, సెల్తోస్ ల మధ్య స్థానాన్ని దక్కించుకోవడం జరిగింది. ఈ కియా సైరోస్ హెచ్ టి కే, హెచ్ టి కే ప్లస్, హెచ్టిఎక్స్, హెచ్డి ఎక్స్ ప్లస్ అని 4 వేరెంట్లలో లభిస్తుందని సమాచారం.

కియా సైరోస్ ఇంజన్ ఆప్షన్స్ ఇలా ఉన్నాయి..
ఇందులో1.0 లీటర్ టర్బో ఛార్జ్డ్ పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ అనే రెండు ఆప్షన్లో ఉన్నాయి. ఇందులో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 118 బిహెచ్ పి పవర్, 172 ఎన్ ఎం టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తాయి. డీజిల్ ఇంజన్ 116 హెచ్పి పవర్, 250 ఎన్ ఎం టార్కును ప్రొడ్యూస్ చేస్తాయి. 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో ఈ రెండు ఇంజిన్స్ జత చేయబడి ఉంటాయి. 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ ఇంజిన్ కోసం అలాగే 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్ డీజిల్ ఇంజన్ కోసం ఉంటాయి.

కియా సైరోస్ సెక్యూరిటీ ఫీచర్స్ ఇలా ఉన్నాయి…
ప్రస్తుతం ఉన్న కే 1 ప్లాట్ ఫామ్ పై కియా సైరస్ ఆధారపడి ఉంది. దీనిని బలోపేతం చేస్తున్నట్టు కియా తాజాగా తెలిపింది. కియా సైరోస్ లైన్ కీప్ అసిస్ట్ తో పాటు 16 అధునాతన అడాప్టివ్ సెక్యూరిటీ ఫీచర్స్ ను కలిగి ఉంది. కియా సైరోస్ లో హిల్ స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 6 ఎయిర్ బ్యాగులు అలాగే తదితర ఫీచర్స్ ను కలిగి ఉంది. లెవెల్ 2 కూడా ఇందులో ఉంది.

కియా సైరోస్ ఇతర ఫీచర్లు ఇలా ఉన్నాయి…
టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే తో ఉన్న 30 అంగుళాల ట్రినిటీ పనోరమిక్ డ్యూయల్ స్క్రీన్ సెట్ అప్ ఇందులో ఉంది. ఈ సిస్టం వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే సపోర్ట్ ను కలిగి ఉంది. అదనంగా క్యాబిన్లో వెంటిలేటెడ్ సీట్లు, స్లైడింగ్, రిక్లైనింగ్ రెండవ వరస సీట్లు, ఇంజన్ స్టార్ట్ లేదా స్టాప్ చేయడానికి పుష్ బటన్, 360 డిగ్రీల పార్కింగ్ కెమెరా, వైర్లెస్ చార్జర్, ట్విన్ యు ఎస్ బి సి పోర్ట్స్ , ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, పనోరమిక్ సన్ రూఫ్ ను కలిగి ఉంది.