కియా సెల్టోస్‌ కొత్త వెర్షన్‌: ధర ఎంతంటే?

నూతన సంవత్సర సందర్భంగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా కొత్త తరం సెల్టోస్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.10.99 లక్షలుగా ఉంది. టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ ధర రూ.19.99 లక్షల వరకు ఉంటుంది. హెచ్‌టీఈ, హెచ్‌టీఈ(ఓ), హెచ్‌టీకే, హెచ్‌టీకే (ఓ), హెచ్‌టీఎక్స్, హెచ్‌టీఎక్స్‌(ఏ), జీసీఎక్స్, జీఎస్‌ఎక్స్‌(ఏ), ఎక్స్‌–లైన్‌ వేరియంట్లలో లభిస్తుంది.


ఇంజిన్‌ ఆప్షన్ల విషయానికి వస్తే, మూడు శక్తివంతమైన మోటార్‌లతో మార్కెట్లో ప్రవేశిస్తుంది. 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ 113బీహెచ్‌పీ పవర్‌ని అందిస్తుంది. మరో 1.5 లీటర్‌ టర్బో–పెట్రోల్‌ ఇంజిన్‌ 158బీహెచ్‌పీ పవర్‌తో డ్రైవింగ్‌ అనుభవాన్ని పంచుతుంది. 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ 118బీహెచ్‌పీ పవర్‌ ఇస్తుంది.

ఈ ఇంజిన్‌లకు మ్యాన్యువల్, ఓఎంటీ, సీవీటీ, 7–స్పీడ్‌ డీసీటీ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 6 ఎయిర్‌బ్యాగులు, లెవల్‌–2 ఏడీఏఎస్, ఈఎస్‌సీ, టీపీఎంఎస్‌(టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌), ఎల్రక్టానిక్‌ పార్కింగ్‌ బ్రేక్, 360–డిగ్రీ కెమెరా వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లలున్నాయి. 1,830 మి.మీ. వెడల్పు, 1,635 మి.మీ. ఎత్తు, 2,690 మి.మీ. వీల్‌బేస్‌తో వస్తోంది.

కారు లోపల 12.3 అంగుళాల డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్, 12.3 అంగుళాల హెచ్‌డీ టచ్ర్‌స్కీన్‌ సింగిల్‌ ప్యానెల్‌ విజువల్‌ కమాండ్‌ సెంటర్‌ ఉన్నాయి. ఫ్రంట్‌ వెంటిలేటెడ్‌ సీట్లు, 64 కలర్‌ యాంబియెంట్‌ మూడ్‌ లైటింగ్, డీ కట్‌ డ్యూయల్‌ టోన్‌ లెదర్‌ స్టీరింగ్‌ వీల్‌ను ఇచ్చారు.  ఎనిమిది స్పీకర్లతో కూడిన బోస్‌ ప్రీమియం సౌండ్‌ సిస్టమ్, పనోరమిక్‌ సన్‌రూఫ్‌ సౌకర్యాలు కలిగి ఉంది. జనవరి రెండో వారం తర్వాత వీటి డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ వెల్లడించింది. రూ.25వేల టోకెన్‌ అమౌంట్‌తో డిసెంబర్‌ 11 నుంచి బుకింగ్స్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.