Kidneys Health: ఈ చెడు అలవాట్ల వల్లే కిడ్నీలు చెడిపోయేది.. ఈరోజు నుంచే బంద్ పెట్టండి..

www.mannamweb.com


Kidneys Health: ఈ చెడు అలవాట్ల వల్లే కిడ్నీలు చెడిపోయేది.. ఈరోజు నుంచే బంద్ పెట్టండి..

కిడ్నీలు మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలు.. వాటి ప్రధాన విధి మన శరీరంలోని మలినాలను ఫిల్టర్ చేయడం. మూత్రపిండాలు సరిగ్గా పని చేయకపోయినా లేదా విఫలమైనా..

మన శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడం ప్రారంభమవుతుంది.. ఇది వివిధ వ్యాధులను వ్యాప్తి చేసే అవకాశాన్ని పెంచుతుంది. కిడ్నీ ఫెయిల్యూర్ అయితే డయాలసిస్‌ను ఆశ్రయించాల్సి వస్తుంది. వాస్తవానికి మన చెడు అలవాట్ల వల్ల మూత్రపిండాల వైఫల్యం సంభవిస్తుందని మీకు తెలుసా?.. అవును మన అలవాట్లే దాదాపు కిడ్నీల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.. వాస్తవానికి కిడ్నీలు సక్రమంగా పనిచేస్తే శరీరంలోని చాలా పనుల్లో ఎలాంటి సమస్య ఉండదు.. కానీ, ఏదైనా సమస్య ప్రారంభమైతే మాత్రం ఎన్నో వ్యాధులు సంభవిస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు ముఖ్యమైన అవయవాలు కూడా దెబ్బతింటాయని వెల్లడిస్తున్నారు..

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల మన కిడ్నీలు పాడైపోతున్నాయి.. బాధాకరమైన విషయమేమిటంటే ఈ తప్పులు కూడా మనకు తెలియకపోవడం.. ఒకవేళ మనకు తెలిసినా పట్టించుకోకపోవడం.. అని నిపుణులు పేర్కొంటున్నారు.

ఈ అలవాట్లు కిడ్నీలను దెబ్బతీస్తాయి

ఎక్కువసేపు మూత్రాన్ని బిగపట్టుకోని ఉండటం..

సాధారణంగా మనం ప్రయాణంలో ఉన్నప్పుడు లేదా నిద్రించే వేళ.. తెల్లవారుజాము వరకు మూత్రాన్ని ఎక్కువసేపు బిగపట్టి ఉంచుతాము. ముఖ్యంగా మార్కెట్‌లో లేదా రోడ్డు పక్కన పబ్లిక్‌ టాయిలెట్లు అందుబాటులో లేకపోవడంతో చాలామంది సమయానికి మూత్ర విసర్జన చేయరు.. ఇది ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది.. ఇలా చేయడం వల్ల కిడ్నీపై ఒత్తిడి పెరిగి ప్రమాదకరంగా మారుతుంది.

తక్కువగా నీరు త్రాగడం..

మన శరీరంలో ఎక్కువ భాగం నీటితో ఉంటుంది.. కాబట్టి రోజంతా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడం చాలా ముఖ్యం. దీంతో శరీర భాగాలన్నీ సక్రమంగా పని చేయగలుగుతాయి. శరీరంలో నీటి కొరత ఏర్పడితే విషపదార్థాలు బయటకు రాకపోవడమే కాకుండా కిడ్నీలు మురికిని శుభ్రం చేయడం కష్టమవుతుంది. దీనివల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.

కిడ్నీలు పాడయ్యే ఆహారాలు తినడం..

మన ఆహారపు అలవాట్లు కిడ్నీ ఆరోగ్యాన్ని పాడుచేయడానికి ఎక్కువగా కారణమవుతాయి.. కాబట్టి పచ్చి కూరగాయలు, తాజా పండ్లు, పండ్ల రసాలు వంటి ఆరోగ్యకరమైన వాటిని మాత్రమే తినడానికి ప్రయత్నించండి.. అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండండి. మీరు బేకన్, సాసేజ్, హాట్ డాగ్లు, రెడ్ మీట్, బర్గర్లు, ప్యాటీలు, పిజ్జా, ప్రాసెస్ చేసిన వస్తువులను తింటే అది మూత్రపిండాలకు చాలా హాని కలిగిస్తుంది.

కావున మూత్రపిండాలకు హాని కలిగించే ఆహారానికి దూరంగా ఉండటంతోపాటు.. ఎక్కువగా నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.