జనగామా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బండరాయితో కొట్టి వ్యక్తిని చంపేశారు.ఆపై శవానికి నిప్పు పెట్టారు. జనగామా జిల్లా కేంద్రంలోని వినాయక బార్ వెనక ఉన్న ప్రాంతంలో ఆదివారం (జనవరి 12, 2025) ఈ దారుణం జరిగింది.
డబ్బులకోసం ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది.
జనగామా జిల్లాలో కోతిని ఆడిస్తూ జీవనం సాగిస్తున్న వెంకన్న అనే వ్యక్తి ఆదివారం దారుణ హత్యకు గురయ్యారు. తన స్నేహితులు 300 రూపాయలు ఇవ్వాలని వెంకన్న ను అడగ్గా.. నిరాకరించడంతో వారి మధ్య వాగ్వాదం తలెత్తింది.
డబ్బులు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన అతని స్నేహితులు వెంకన్నను బండరాయితో కొట్టి చంపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శవానికి నిప్పంటించి కాల్చారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తు వెల్లడైంది. కేవలం మూడు వందలకోసం ప్రాణం తీసిన ఈ ఘటన జనగామాలో కలకలం రేపుతోంది.