ఇంటిని ఎంత నీటిగా ఉంచినా ఒక్కోసారి అంతా గందరగోళంలా తయారవుతుంది. ఆఫీసుకు హడావిడిగా వెళ్లే క్రమంలో లేదా ఇంట్లో ఎలాంటి ఫంక్షన్స్ ఉన్నా.. పండుగలు ఉన్నా..
అద్దాలపై మరకలు పడుతూ ఉంటాయి. అలాగే కప్ బోర్డ్స్, డ్రెస్సింగ్ టేబుల్స్, విండోస్, ఫర్నీచర్స్‌పై మరకలు పడుతూ ఉంటాయి. వాటిని వెంటనే క్లీన్ చేస్తే త్వరగా వచ్చేస్తాయి. కానీ అలా వదిలేస్తే మాత్రం మొండి మరకలుగా ఉండిపోతాయి. దీంతో వీటిని క్లీన్ చేసేందుకు మహిళలు అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. కానీ వీటిని కూడా ఎంతో ఈజీగా సింపుల్‌గా వదిలించుకోవచ్చు. ఇప్పుడు చెప్పే చిట్కాలు ట్రై చేస్తే కచ్చితంగా పోతాయి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.
వెనిగర్ – నిమ్మరసం:
బెస్ట్ కిచెన్ హ్యాక్‌గా వెనిగర్ ఎంతో చక్కగా పని చేస్తుంది. వెనిగర్ సహాయంతో ఇంటిని ఎంతో శుభ్రంగా, నీటిగా ఉంచుకోవచ్చు. అదే వెనిగర్‌తో ఇప్పుడు మనం అద్దాలు, ఇంట్లో ఫర్నీచర్‌పై పడ్డ మరకలను కూడా వదిలించుకోవచ్చు. ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా వెనిగర్, నిమ్మరసం కలిపి మరకలపై చల్లండి. ఒక ఐదు నిమిషాలు అలానే ఉంచి ఆ తర్వాత మంచి క్లాత్‌తో క్లీన్ చేస్తే త్వరగా వదిలిపోతాయి.
బేకింగ్ సోడా:
బెస్ట్ కిచెన్ హ్యాక్‌గా బేకింగ్ సోడా కూడా పని చేస్తుంది. ఎలాంటి మరకలు, మచ్చలను తొలగించి ఇంటిని పరిశుభ్రంగా మార్చుతుంది. ఈ క్రమంలోనే గాజు వస్తువులు, అద్దాలు, ఫర్నీచర్‌పై ఉండే మరకలను కూడా తొలగించుకోవచ్చు. ముందుగా బేకింగ్ సోడాలో నీటినిక లిపి మరకలపై రాయండి. ఆ తర్వాత తడి క్లాత్‌తో తుడిస్తే సింపుల్‌గా పోతాయి.
డిష్ వాష్ లిక్విడ్:
డిష్ వాష్ లిక్విడ్ సహాయంతో కూడా అద్దాలు, గాజు వస్తువుల, ఫర్నీచర్‌పై ఉండే మరకలను తొలగించి.. తెల్లగా మిలమిల మెరిసేలా చేయవచ్చు. కొద్దిగా నీటిని తీసుకుని అందులో డిష్ వాష్ లిక్విడ్ కలపాలి. ఆ తర్వాత తడి క్లాత్ సహాయంతో మరకలు ఉన్న చోట తుడిస్తే పోతాయి.
రబ్బింగ్ ఆల్కహాల్:
రబ్బింగ్ ఆల్కహాల్‌తో కూడా మరకలను వదిలించుకోవచ్చు. ఇది మురికిని, క్రిములను దూరం చేస్తుంది. రబ్బింగ్ ఆల్కహాల్‌ను మురికి ఉన్న చోట స్ప్రే చేసి ఆ తర్వాత తడిగుడ్డతో క్లీన్ చేస్తే చాలు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)