హరి హర వీరమల్లు’ లో నటించినందుకు కోట శ్రీనివాస రావు అందుకున్న చివరి రెమ్యూనరేషన్ ఎంతనో తెలుసా?

 దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు(Kota Srinivasa Rao) మరణ వార్త యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసిన సంగతి అందరికీ తెలిసిందే.


ఆయన లేని లోటుని ఎవ్వరూ పూడవలేరు అనేది వాస్తవం. ఎస్వీ రంగారావు లాంటి మహానటుడ్ని మళ్ళీ చూడలేమని అనుకున్న తెలుగు ప్రజలకు కోట శ్రీనివాస రావు ఒక వరం లాగా దొరికాడు. గత కొంతకాలంగా అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరం గా ఉంటూ వచ్చిన కోట శ్రీనివాస రావు ని ఆడియన్స్ బాగా మిస్ అవుతూ ఉండేవారు. మళ్ళీ ఆయన్ని వెండితెర మీద చూస్తే బాగుంటుంది అని కోరుకునే వారు. కానీ ఆరోగ్యం సహకరించకపోవడం తో కోట కి సాధ్యపడలేదు. అప్పటికీ ఇంట్లో ఖాళీగా కూర్చొని బోరు కొడుతున్న సమయం లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కి ఫోన్ చేసి మరీ ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం లో ఒక చిన్న పాత్రని ఇప్పించుకున్నాడు.

ఇదే ఆయన చివరి చిత్రం. గమ్మత్తు ఏమిటంటే కోట శ్రీనివాస రావు మొదటి సినిమా చిరంజీవి ‘ప్రాణం ఖరీదు’ తో మొదలైతే, ఆయన చివరి చిత్రం పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ తో ముగిసింది. ఈ సినిమా ఈ నెల 24 న విడుదల కాబోతుంది. నేటి నుండి సరిగ్గా 10 రోజుల సమయం మాత్రమే ఉంది. అంటే మరో 10 రోజుల్లో కోట శ్రీనివాస రావు గారిని చివరిసారిగా వెండితెర పై చూడబోతున్నాము అన్నమాట. పెద్ద వయస్సులో ఉన్నాడు కాబట్టి కథని ప్రభావితం చేసే క్యారక్టర్ పడి ఉండకపోవచ్చు, కానీ రెమ్యూనరేషన్ మాత్రం భారీగానే ఇచ్చారట. ఈ సినిమా కోసం అయాన్ నాలుగు నుండి ఐదు రోజుల కాల్ షీట్స్ ని ఇచ్చాడట. అందుకు గానూ నిర్మాత AM రత్నం దాదాపుగా 4 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని ఇచ్చాడట. అంటే ఒక రోజుకి లక్ష రూపాయిలు అన్నమాట. ఇదే కోట శ్రీనివాస రావు గారి చివరి రెమ్యూనరేషన్.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.