వరుణ్ తేజ్‌పై ఫన్నీ కామెంట్స్ చేసిన లావణ్య త్రిపాఠి.. మండిపడుతున్న నెటిజన్లు

Share Social Media

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఓ వైపు మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సినిమాలతో దూసుకుపోతున్నారు. సొట్ట చెంపల ముద్దుగుమ్మ లావణ్య ‘మిస్ పర్ఫెక్ట్’ వెబ్ సిరీస్ లో నటించిన విషయం తెలిసిందే.
అయితే ఈ సిరీస్‌లో లావణ్య ఓసీడీ లక్షణాలున్న అమ్మాయిగా నటిస్తుంది. కాగా ఇటీవల ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో లావణ్యను.. నిజ జీవితంలో మీకు ఓసిడి లక్షణాలు ఉన్నాయా? అని మీడియా వారు ప్రశ్నించగా.. ”నీట్ గా ఉండటానికి ఆలోచిస్తాను కానీ మరీ ఎక్కువగా కాదు. నా వస్తువులను నేను క్లీన్ గా ఉంచుకుంటాను.

కాకపోతే నాకు ఓసిడి లక్షణాలున్న ఫ్రెండ్స్ ఉన్నారు. అప్పట్లో నా ఫ్లాట్ పక్కన ఉండే అమ్మాయిలో ఇలాంటి లక్షణాలు చూశాను. వారి పనిమనిషి ఇల్లు మొత్తం శుభ్రం చేస్తుంది. కానీ ఆమెకు నచ్చదు. మళ్లీ రెండోసారి ఆ అమ్మాయి క్లీన్ చేస్తుంది” అని లావణ్య వెల్లడించింది. మీ ఆయనకు ఓసీడీ ఉందా? అని అడగ్గా.. ఎస్.. కొంచెం ఉందంటూ నవ్వుతూ బదులిస్తుంది. వరుణ్ ప్రతి ఐటెమ్ ను టీష్యుతో శుభ్రం చేస్తారు. నాకు సమయం దొరినప్పుడు నేనే అన్నీ క్లీన్ చేస్తా. అలాగని ప్రతి రోజు నాకు చెప్పొద్దు” అంటూ లావణ్య ఫన్నీగా చెప్పుకొచ్చింది. దీంతో మెగా ఫ్యాన్స్..లావణ్య.. వరుణ్‌కు వార్నింగే ఇచ్చిందిగా పాపం, రోజూ క్లీన్ చేయడం నా వల్ల కాదు. నీ వస్తువులు నువ్వే క్లీన్ చేసుకోమని చెప్పడంతో వరుణ్ ఎలా ఫీల్ అయ్యారో అంటూ సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ లావణ్యపై కోపంగా కామెంట్లు చేస్తున్నారు.

Related News