ప్రాణం నిలబెట్టే ఈ 4 మొక్కల గురించి ఇప్పుడే తెలుసుకోండి..! పాము అంటే మీరు భయపడరు

ర్షాకాలంలో వాతావరణం తేమగా మారినప్పుడు పాములు పొడి, సురక్షితమైన ప్రదేశాల కోసం వెతుకుతూ ఇళ్లలోకి లేదా వాటి పరిసరాల్లోకి వస్తుంటాయి. ఇలాంటప్పుడు పాముకాటు ప్రమాదం ఉంది.


పాము విషాన్ని తగ్గించడంలో సహాయపడే కొన్ని మొక్కలు ఉన్నాయి.. ఈ మొక్కలు ఉన్నప్పటికీ.. వైద్య సహాయం అందే వరకు మాత్రమే ఉపయోగించాలి.

జిల్లేడు చెట్టు (Calotropis Gigantea).. జిల్లేడు చెట్టుకు మందమైన ఆకులు, తెలుపు రంగు పువ్వులు ఉంటాయి. ఈ మొక్క కొమ్మను విరిస్తే తెల్లటి పాలు లాంటి ద్రవం బయటకు వస్తుంది. పల్లె వైద్యంలో ఈ పాలను పాము కరిచిన చోట రాస్తే విషం వ్యాప్తి చెందకుండా ఆపుతుందని నమ్ముతారు.

సర్పగంధ (Sarpagandha).. ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. సర్పగంధ వేరులో కొన్ని ప్రత్యేకమైన రసాయన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి పాము విషం శరీరంలో వ్యాప్తి చెందే ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయని నమ్మకం. ఈ మొక్క పేరు కూడా పాములతో సంబంధం ఉన్నందున దీనికి ప్రాధాన్యత ఉంది.

బోడ కాకరకాయ (Momordica dioica).. బోడ కాకరకాయ మొక్క వేడి, తడి వాతావరణంలో ఎక్కువగా పెరుగుతుంది. దీని పండ్లను కూరగాయలుగా కూడా తింటారు. పల్లె వైద్య పద్ధతుల ప్రకారం.. ఈ మొక్క వేరును నూరి, పాలతో కలిపి తీసుకుంటే పాముకాటు ప్రభావాలు తగ్గుతాయని చెబుతారు.

నేలవేము (Green Chiretta).. నేలవేము ఆకులను కూడా పాముకాటు చికిత్సలో ఉపయోగిస్తారు. దీని ఆకులను మెత్తగా పేస్ట్‌లా చేసి కరిచిన చోట రాయడం వల్ల విషం ప్రభావం తగ్గుతుందని స్థానిక వైద్యులు చెబుతుంటారు.

Note: వైద్య సహాయం అందే వరకు మాత్రమే పై చిట్కాలను ఉపయోగించాలి. పాము కాటుకు గురైన వెంటనే మీరు చేయాల్సింది వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి లేదా సంబంధించిన వైద్యుడి వద్దకు వెళ్లాలి. నిర్లక్ష్యం చేయొద్దు. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.