మనం ధరించే వాచ్‌ల లెదర్ దేనితో తయారు చేస్తారో తెలుసా? మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు

www.mannamweb.com


చాలా మంది రకరకాల వాచ్‌లు ధరించడానికి ఇష్టపడతారు. ఇంకొంతమంది బ్రాండెడ్ వాచ్‌లను ఇష్టపడతారు. మరికొందరు లెదర్ బ్రాండ్‌లను ఇష్టపడతారు. అయితే, ఈ లెదర్ బ్రాండ్ వివిధ రకాలుగా ఉంటుంది.

అన్నీ ఒకేలా కనిపించినా.. వీటి మధ్య చాలా వైవిధ్యాలు ఉంటాయి. వాచ్‌ లెదర్‌ తయారీకి ఆవు చర్మం నుంచి మొసలి చర్మం వరకు, వివిధ జంతువుల చర్మాలను ఉపయోగిస్తారు.

వాటిల్లో ఒకటి ఫుల్ గ్రెయిన్ లెదర్ – దీనిని ఆవు, కంగారు వంటి జంతువుల చర్మంతో తయారు చేస్తారు. ఈ లెదర్‌ను వెంట్రుకల క్రింద ఉన్న చర్మం నుంచి తయారు చేస్తారు. ఈ లెదర్‌ చాలా బలంగా, మన్నికగా ఉంటుంది. ప్రాసెసింగ్ సమయంలో జుట్టు తొలగించి, తోలు భాగంతో దీనిని తయారు చేస్తారు. ఈ రకమైన తోలు చెమట లేదా తేమను బాగా నిరోధిస్తుంది.

కాఫ్ స్కిన్ లెదర్ – ఈ రకమైన తోలు సాధారణంగా దూడ చర్మంతో తయారు చేస్తారు. మృదువైన, చక్కటి ఆకృతి కారణంగా ఈ రకమైన తోలుకు అధిక డిమాండ్ ఉంటుంది. ఈ లెదర్ వాచ్ చేతికి పెట్టుకుంటే హాయిగా అనిపిస్తుంది. అలాగే, దీని నాణ్యత కారణంగా, దీని ధర కూడా ఎక్కువగా ఉంటుంది.

ఎలిగేటర్ లెదర్ – పేరు సూచించినట్లుగా, ఈ రకమైన తోలు మొసలి చర్మంతో తయారు చేస్తారు. ఇది చాలా ఖరీదైన తోలు. జంతువుల తోలు కంటే పటిష్టంగా ఉంటుంది. లెదర్‌ వాచ్ బ్రాండ్‌గా మాత్రమే కాకుండా, మెరిసే సహజ ఎనామెల్ దీనికి ఉంఉటంది. వివిధ రకాల ఫ్యాషన్ వస్తువులను దీనితో తయారు చేస్తారు.

స్వెడ్ లెదర్ – జంతు చర్మాల దిగువ నుంచి తీసిన ప్రత్యేక రకం తోలు ఇది. ఈ తోలు చాలా మృదువుగా ఉన్నందున డిమాండ్ కూడా ఎక్కువే. స్వెడ్ సాధారణంగా గొర్రె చర్మం నుంచి తయారు చేస్తారు. అయితే మేక, పంది, దూడ, జింకల చర్మంతో సహా ఇతర రకాల జంతువుల చర్మాలను కూడా లెదర్‌కి ఉపయోగిస్తారు. అలాగే పైనాపిల్ లెదర్ కూడా చాలా ఫేమస్‌. పైనాపిల్ మొక్క ఆకుల నుంచి ఈ ప్రత్యేకమైన తోలు తయారు చేస్తారు. పైనాపిల్ ఆకుల్లో పినాటెక్స్ అనే ప్రత్యేక ఫైబర్ ఉంటుంది. ఇది కూడా తోలు లాంటి పదార్థమే.