మనలో చాలా మంది ముఖం మీద ఎటువంటి మచ్చలు లేకుండా అందంగా తెల్లగా మెరిసిపోవాలని కోరుకుంటారు. ముఖం మీద నల్లని మచ్చలు, మంగు మచ్చలు వంటివి ఉంటే ముఖం అందంగా ఉండదు.
అలాగే ఆత్మ విశ్వాసం కూడా తగ్గుతుంది. ఈ సమస్యకు ఇంటిలోనే మంచి పరిష్కారం ఉంది.
వంటింటిలో ఉండే కొన్ని వస్తువులను ఉపయోగించి ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. ఇవి ఎక్కువగా బుగ్గలు, ముక్కు ఇరువైపులా వస్తుంటాయి. భుజాలు, మెడ, వీపు మీద కూడా ఇలాంటి మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు అందంగా ఉన్న వ్యక్తులను సైతం అందహీనంగా మార్చేస్తాయి.
వీటికి సాధారణ మచ్చలను తగ్గించే చిట్కాలను పాటిస్తే సరిపోదు. ఈ మచ్చలను తగ్గించటానికి నిమ్మరసం,పాలు చాలా బాగా సహాయపడతాయి. ఒక బౌల్ లో ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ పాలు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మంగు మచ్చలు ఉన్న ప్రదేశంలో రాసి ఒక నిమిషం సున్నితంగా మసాజ్ చేయాలి.
అరగంట అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే క్రమంగా మచ్చలు తగ్గుముఖం పడతాయి. నిమ్మరసంలో ఉండే బ్లీచింగ్ లక్షణాలు మచ్చలను తగ్గించి ముఖం తెల్లగా కాంతివంతంగా మారేలా చేస్తుంది. నిమ్మరసం మనకు ఇంటిలో సులువుగా లభిస్తుంది.
పాలను ప్రతి రోజు మనం ఉపయోగిస్తాం. పాలల్లో ఉండే పోషకాలు మచ్చలను తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాస్త సమయాన్ని కేటాయిస్తే చాలా తక్కువ ఖర్చుతో ఇటువంటి సమస్యల నుండి బయట పడవచ్చు. వేలకొద్ది డబ్బును ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.