రోజుకొక యాపిల్ పండు.. ఇస్తుంది మీ ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.. డాక్టర్లతో పన్లేదు ఇక అని చాలామంది అంటుంటారు. అయితే రోజుకొక యాపిల్ పండు తినడం సాధ్యపడదు కాబట్టి.. రోజుకో అరటి పండు తిన్నా ఆరోగ్యంగా ఉండొచ్చునని వైద్య నిపుణులు అంటుంటారు. మరి అదేంటో చూసేద్దాం..
అరటిపండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. అందుకే పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఇష్టపడే ఫ్రూట్ ఇది. ప్రతిరోజూ నెల రోజుల పాటు క్రమం తప్పకుండా ఒక అరటిపండు తింటే, మీ శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి.
అరటిపండ్లలోని విటమిన్ B6 రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేయడంలో తోడ్పడుతుంది. అరటిపండు మన శరీరానికి త్వరితగిన శక్తిని బూస్ట్ చేస్తుంది. ఇక తాజాగా ఓ అధ్యయనంలో అరటిపండు తినడం ఆరోగ్యానికి ఎంతోమంచిదని తేలింది.
అరటి, యాపిల్ తినేవారిలో ఏ కారణంతోనైనా మరణించే ముప్పు దాదాపు 40 శాతం తక్కువని అధ్యయనంలో తేలింది. వారంలో 3 నుంచి 6 సార్లు ఈ పండ్లు తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచించారు.
అరటిలో పుష్కలంగా ఉండే పొటాషియం బీపీని కంట్రోల్ చేస్తుందని తెలిపారు. కడుపు ఉబ్బరం తగ్గించడంతో పాటు శరీరానికి అత్యవసర శక్తి అందిస్తాయని పేర్కొన్నారు.
అటు యాపిల్‌లో పోషకాలు పుష్కలంగా దొరుకుతాయి. విటమిన్ సి, పొటాషియం, విటమిన్ కె ఎక్కువగా ఉంటాయి. అలాగే యాపిల్స్‌లో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.