రూ.10కి మద్యం.. రూ.50కి బియ్యం బస్తా … ఎక్కడో తెలుసా ??

ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో వైకాపా నాయకులు ప్రలోభాల పర్వాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికల అధికారులకు చిక్కకుండా సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు.


ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో గురువారం నుంచి మందుబాబులకు రూ.10 నోటు, గృహిణులకు రూ.50 సీరియల్‌ నంబర్‌ నోట్లు టోకెన్లుగా పంపిణీ చేశారు. రూ.10 నోటు తీసుకెళ్లిన వారికి ప్రభుత్వ మద్యం దుకాణంలో క్వార్టర్‌ బాటిల్‌ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. అలాగే రూ.50 నోటు తీసుకెళ్లిన వారికి వైకాపా నేతల దుకాణాల్లో బియ్యం బస్తాలు అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు గురువారం అర్ధరాత్రి కొత్తపట్నం రోడ్డులోని ఎఫ్‌సీఐ గోదాముల వద్ద తనిఖీలు చేపట్టి మూడు లారీల్లోని 540 బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు.
శుక్రవారం గాంధీరోడ్డులోని ఓ దుకాణంలో తనిఖీలు చేసి 4 వేల బియ్యం బస్తాలు నిల్వ ఉంచినట్లు గుర్తించారు. మరోవైపు రాజీవ్‌నగర్‌లోని పార్టీ కార్యాలయం వద్ద ఫ్లయింగ్‌స్క్వాడ్‌ అధికారులు రూ.లక్ష నగదు పట్టుకున్నారు.