LPG Cylinder : కేంద్రం సర్కార్ కీలక నిర్ణయం.. రూ.300 తగ్గనున్న గ్యాస్ సిలిండర్ ధర?

వంటింటి మహిళలకు త్వరలోనే కేంద్రం గుడ్ న్యూస్(Good News) చెప్పనున్నట్టు తెలుస్తోంది. ఈ రోజుల్లో గ్యాస్ సిలిండర్ లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు.
గ్యాస్(LPG) వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం సిలిండర్లపై(Cylinder) సబ్సడీ ఇస్తోంది. ప్రస్తుతం దేశంలో LPG వినియోగదారుల సంఖ్య దాదాపు 33 కోట్లు. 2025-26 నాటికి మరో 75 లక్షల ఎల్‌పీజీ కనెక్షన్లు వస్తాయని గతేడాది అంచనా వేశారు. అయితే..గత రెండు మూడున్నరేళ్లుగా గ్యాస్ ధరలు పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


ఈ నేపథ్యంలో గతేడాది ఆగస్టులో గృహోపకరణాల గ్యాస్ సిలిండర్(Domestic cylinder) ధరను కేంద్ర ప్రభుత్వం రూ.200 తగ్గించింది. ఆ తర్వాత కూడా మరో రూ.100 తగ్గించిచన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని..పేద, మధ్యతరగతి ప్రజలను ఆకర్షించేలా కేంద్రం ప్రభుత్వం గ్యాస్ ధరలపై దృష్టి సారించినట్లు సమాచారం. అర్హులైన పేద కుటుంబాలకు(Poverty line) తక్కువ ధరకే ఎల్పీజీ సిలిండర్లను అందించాలని భావిస్తోందని పార్టీ వర్గాల సమాచారం.
ఈ పరిస్థితుల్లో పేద కుటుంబాలకు సబ్సిడీ మొత్తాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోందని చెబుతున్నారు. ఈ సబ్సిడీ రూ.300 వరకు ఉండవచ్చని తెలుస్తోంది. అప్పుడు సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర రూ.660కే వస్తుంది. అదే జరిగితే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్లస్ అవుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.