సామాన్యుల ప్రయాణ సాధనం ద్విచక్ర వాహనం. ఒకప్పుడు ప్రతి ఇంట్లో సైకిల్ ఉన్నట్లే ఆ తర్వాత ఇంటికో స్కూటర్ ఉంటూ వస్తుంది. అయితే ఇవి తక్కువ ధరలో కొనుగోలు చేయాలని చాలామంది అనుకుంటూ ఉంటారు.
అయితే మిగతా కంపెనీల కంటే TVS కంపెనీ సరసమైన ధరల్లో ద్విచక్ర వాహనాలను వినియోగదారులకు ఇప్పటికే అందించింది. ఈ కంపెనీ 100 సిసి నుంచి 300 సిసి వరకు వివిధ రకాల వాహనాలను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే తాజాగా కొత్త వాహనాన్ని విడుదల చేసింది. అదే టీవీఎస్ Ronin. అంతర్జాతీయంగా వాహనాలను అందిస్తున్న ఈ కంపెనీ కొత్తగా ఈ మోడల్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టడంతో అందరినీ ఆకర్షిస్తుంది అయితే ఈ బైక్ ఎలా ఉందో చూద్దాం..
కొత్తగా మార్కెట్లోకి వచ్చిన Tvs Ronin ఆకట్టుకునే డిజైన్ లో ఉంది. ఇందులో డిఫరెంట్ ఫ్యూచర్లతో యూత్ ను ఆకర్షిస్తున్నాయి. ఈ ఈ బైక్ డిజైన్ కొత్తగా కనిపిస్తుంది హెడ్లైట్ చుట్టూ మార్పులు చేశారు. యాంటీ లాకింగ్ సిస్టం అమర్చారు. ముఖ్యంగా బ్లూటూత్ కనెక్టివిటీ, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ క్లస్టర్ను అందించారు. దీనిపై రైడ్ చేసేవారికి సీట్ కంఫర్టబుల్ గా ఉంటుంది.
అయితే ఈ బైక్ ఇంజన్ మరింత ఆకర్షణీయంగా ఉంది. ఇందులో 225.9 సిసి, ఆయిల్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ను అమర్చారు. ఈ ఇంజన్ 20. 1 బిహెచ్పి పవర్, 19.93 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ పనితీరు మెరుగ్గా ఉంటుందని టీవీఎస్ కంపెనీ తెలుపుతోంది. దీనిపై లీటర్ ఇంధనానికి 42 కిలోమీటర్ల వరకు మైలేజ్ పొందవచ్చు అని పేర్కొంటుంది. బైక్ స్పీడ్ తక్కువగా ఉన్నప్పుడు ఇంజన్ ఆఫ్ కాకుండా ఉండడానికి గ్లైడ్ త్రు ట్రాఫిక్ ఫంక్షన్ ను ఏర్పాటు చేశారు.
అలాగే ఏబీఎస్ సిస్టం తో పాటు అడ్జస్టేబుల్ క్లచ్, బ్రేక్ లివర్లు, సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ సెన్సార్ వంటివి ఉన్నాయి. ఎల్ఈడి హెడ్లైన్లు, ఎల్ఈడి టర్న్ ఇండికేటర్లు వంటితోపాటు స్టార్టర్ ను కూడా టీవీఎస్ రోనిన్ లో కనిపిస్తాయి. అలాగే ఈ బైక్ లో యు ఎస్ డి పోర్క్స్ మోనో షాక్ సస్పెన్షన్ సెటప్ ను అందించారు. 2025లో రొనిన్ బైక్ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటుందని చెబుతున్నారు ఇది మార్కెట్లోకి వస్తే మిగతా వాటికి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇక టీవీఎస్ Ronin బైకును రూ 1.35 లక్షలకు విక్రయిస్తున్నారు. అయితే ఏ బి ఎస్ డ్యూయల్ ఛానల్ కలిగిన బైక్ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. టీవీఎస్ నుంచి ఏ బైక్ వచ్చినా వినియోగదారులకు తక్కువ ధరలోనే అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు
అయితే ఇప్పుడు లగ్జరీ ఫీచర్స్ ఉన్న ఈ బైక్ ను కూడా మిగతా వాటికంటే తక్కువ ధరకే అందించేస్తున్నారు. అంతేకాకుండా ఈ బైక్ కొత్త డిజైన్లు కలిగి ఉండడంతో చాలామంది దీనిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.