2025లో మహాకుంభమేళా ఎప్పుడు? పుణ్య స్నానం తేదీలు గురించి తెలుసుకోండి..

www.mannamweb.com


కుంభమేళా అనేది హిందూ మతంలో ఒక ముఖ్యమైన పండుగ. దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మహా కుంభమేళా సందర్భంగా పవిత్ర నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ హరిస్తాయని నమ్మకం.

కుంభమేళా సమయంలో కోట్లాది మంది భక్తులు తరలివచ్చి నదిలో స్నానాలు ఆచరిస్తారు. 12 ఏళ్ల తర్వాత మహా కుంభమేళా నిర్వహించనున్నారు. భారతదేశంలోని 4 పవిత్ర నదులు, 4 పుణ్యక్షేత్రాల్లో మాత్రమే కుంభమేళా నిర్వహిస్తారు. ఈ మహా కుంభమేళా ప్రయాగ్‌రాజ్, నాసిక్, హరిద్వార్, ఉజ్జయినిలలో మాత్రమే నిర్వహించనున్నారు.

ఋషుల కాలం నుంచి కుంభమేళాను నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించనున్నారు. బృహస్పతి వృషభరాశిలో ఉన్నప్పుడు, సూర్యుడు మకరరాశిలో ఉన్నప్పుడు, ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా నిర్వహిస్తారు. అటువంటి పరిస్థితిలో మహాకుంభమేళా వేడుకలు 2025 ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలుసుకుందాం..

2025లో మహాకుంభ మేళా ఎప్పుడు నిర్వహిస్తారంటే

2025 సంవత్సరంలో మహా కుంభమేళా 13 జనవరి 2025న పుష్య మాసంలోని పౌర్ణమి తిధిలో ప్రారంభమవుతుంది. ఈ కుంభమేళా 26 ఫిబ్రవరి 2025న మహాశివరాత్రి రోజున ముగుస్తుంది. 12 ఏళ్ల తర్వాత ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళా నిర్వహించనున్నారు. అంతకుముందు 2013లో ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా నిర్వహించారు.

మహా కుంభమేళా 2025లో ముఖ్యమైన పర్వదినాలు, స్నాన తేదీలు

పుష్య మాసం పౌర్ణమి – 13 జనవరి 2025
మకర సంక్రాంతి – 14 జనవరి 2025
మౌని అమావాస్య – 29 జనవరి 2025
వసంత పంచమి – 3 ఫిబ్రవరి 2025
మాఘ పౌర్ణమి – 12 ఫిబ్రవరి 2025
మహా శివరాత్రి – 26 ఫిబ్రవరి 2025

కుంభమేళా వేడుక ఎక్కడ జరుగనున్నాయంటే

ప్రయాగ్‌రాజ్ – బృహస్పతి వృషభరాశిలో, సూర్యుడు మకరరాశిలో ఉన్న సమయంలో ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహిస్తారు.
హరిద్వార్ – సూర్యుడు మేషరాశిలో, బృహస్పతి కుంభరాశిలో ఉన్న సమయంలో హరిద్వార్‌లో కుంభమేళా నిర్వహిస్తారు.
నాసిక్ – సూర్యుడు, బృహస్పతిలిద్దరూ సింహరాశిలో ఉన్నప్పుడు మహారాష్ట్రలోని నాసిక్‌లో కుంభమేళా వేడుకలను జరుపుతారు.
ఉజ్జయిని – బృహస్పతి సింహరాశిలో ఉన్న సమయంలో సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళా వేడుక జరుగుతుంది

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.