దమ్కీలకు భయపడేదే లేదు.. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాలలో పవన్ హాట్ కామెంట్స్

www.mannamweb.com


జనసేన అధినేత ఎన్డీఏ కూటమి సభ్యుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

మహారాష్ట్రలో ఈ నెల 20వ తేదీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఎన్డీఏ కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ సైతం రెండు రోజులపాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొనబోతున్నారు నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఈ ప్రచార కార్యక్రమాలలో పాల్గొనాల్సి ఉండగా ఆయన తమ్ముడు మరణించడంతో ఆయన మహారాష్ట్ర పర్యటనను రద్దు చేసుకున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ మాత్రమే ఈ ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు.. ఈ ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఈయన మహాయుతి కూటమి గెలుపు కోసం డెగ్లూర్‌ లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. చత్రపతి శివాజీ మహారాజ్ నడిచిన నేలపై తాము ఎవరికి భయపడేది లేదని తెలిపారు.

సనాతన ధర్మ పరిరక్షణ జనసేన లక్ష్యమని ఈయన తెలిపారు.సినిమాల్లో పోరాటాలు చేయడం, గొడవ పెట్టడం చాలా ఈజీ అని అదే నిజ జీవితంలో సనాతన ధర్మం కోసం పోరాటం చేయడం గొడవపడి నిలబడటం చాలా కష్టమని తెలిపారు. ప్రతి ఒక్క హిందువు గుండెలో రామనామం లేకుండా ఉండదని అన్నారు. హిందువులంతా ఏకమైతే.. హైదరాబాద్ నుంచి దేశాన్ని విచ్ఛినం చేసేందుకు వచ్చే వాళ్లు ఎంత అంటూను ఒవైసీ సోదరుల ఉద్దేశించి ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చత్రపతి శివాజీ నడిచిన ఈ నేలపై ఎలాంటి దమ్కీలకు భయపడేది లేదంటూ పవన్ కళ్యాణ్ మరోసారి తన స్టైల్ లోని మజ్లిస్ పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.