మహేష్ బాబు నాపై కోప్పడ్డారు.. ఇన్నాళ్టికి అసలు విషయం చెప్పిన సమంత

టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి చెప్పక్కర్లేదు. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న సామ్.. ఇటీవలే శుభం సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో అతిథి పాత్రలో కనిపించింది. ఇక ఇప్పుడు మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తుంది. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది.

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తిరిగి సినిమాల్లో బిజీ అవుతుంది. సమంత ఇటీవలే నిర్మాతగా మారింది. రీసెంట్ గానే శుభం అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. తెలుగు ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఏలింది సమంత.. ఏ స్టార్ హీరో సినిమా చూసినా హీరోయిన్ గా సమంతానే ఉండేది. అయితే గతకొంతకాలంగా సమంత సినిమాలు చేయడం లేదు. మొన్నటివరకు మాయోసైటిస్ తో బాధపడిన సమంత ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. అలాగే ఏడాదిపాటు సమంత సినిమాలకు బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే.. ఇప్పుడు తిరిగి సినిమాలతో బిజీగా మారిపోయింది. సమంత సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలతోనూ వార్తల్లో నిలుస్తుంది. దర్శకుడు రాజ్ నిడమూరితో ప్రేమలో ఉందంటూ తెగ వార్తలు వినిపిస్తున్నాయి.


ఇదిఇలా ఉంటే సమంత ఓల్డ్ వీడియోకి ఒకటి సోషల్  మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కామెంట్స్ చేసింది సమంత.. మహేష్ బాబు ఓ సందర్భంలో తన పై సీరియస్ అయ్యాడని తెలిపింది. దాంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సితార విషయంలో మహేష్ బాబు తన పై సీరియస్ అయ్యాడు అని సమంత చెప్పుకొచ్చింది. అసలు విషయం ఏంటంటే..

మహేష్ బాబు గారాల పట్టి సితార ;గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ చిన్నది ఇప్పటికే యాడ్స్ ద్వారా అభిమానులను అలరిస్తుంది. హీరోయిన్ అవ్వాలన్నది తన డ్రీమ్ అని పలుసార్లు చెప్పింది సితార. అయితే సమంతకు, సితారకు మధ్య మంచి బాండింగ్ ఉంది. సితార చిన్న తనంలో తాను స్టార్ హీరోయిన్ అవుతుంది అని మహేష్ తో అన్నదట  సమంత దాంతో ఆయన సీరియస్ అయ్యి లేదు సైన్‌టిస్ట్ అవుతుంది అని మహేష్ అన్నాడట.. సినిమాలో కూడా సైన్‌టిస్ట్ పాత్ర చెయ్యొచ్చు అని తాను సరదాగా మహేష్ తో చెప్పాను అని సమంత తెలిపింది. ఇందుకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.