వరద బాధితులకు అండగా మహేష్.. రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం.

www.mannamweb.com


గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి.

ఈ క్రమంలోనే పలు లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఖమ్మం, విజయవాడ ప్రాంతాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే సినీ ప్రముఖులు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు అండగా నిలుస్తున్నారు. రెండు రాష్ట్రాలకు తమకు తోచిన సాయం చేస్తున్నారు. ఇప్పటికే ఆయ్ మూవీ యూనిట్, కల్కి నిర్మాతలు, ఎన్టీఆర్, విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ వంటి సినీ స్టార్స్ తెలుగు రాష్ట్రాల సీఎం సహాయనిధులకు భారీ విరాళం ప్రకటించారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం వరద బాధితుల అండగా నిలిచారు.

రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.50 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్‍కు రూ.50 లక్షల చొప్పున విరాళం ప్రకటిస్తున్నాని ట్వీట్ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలకు తక్షణ సహాయం అందించడానికి, పరిస్థితిని పునరుద్ధరించడానికి ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అలాగే ఈ సంక్షోభాన్ని అధిగమించి, మరింత బలంగా ఎదగాలి అంటూ ట్వీట్ చేశారు మహేష్.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే డైరెక్టర్ త్రివిక్రమ్, నిర్మాతలు ఎస్. రాధాకృష్ణ, ఎస్ నాగవంశీలు కూడా రెండు రాష్ట్రాలకు విరాళం అందించారు. అలాగే నందమూరి నటసింహం బాలకృష్ణ సైతం రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.50 చొప్పున ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో అతి త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు