మహీంద్ర కొత్త కారు.. ఫీచర్స్‌ అలా ఉన్నాయి

www.mannamweb.com


ప్రస్తుతం మార్కెట్లో ఎక్స్‌యూవీ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో కంపెనీలు సైతం ఈ సెగ్మెంట్‌లో కార్లను ఎక్కువగా తీసుకున్నాయి. ముఖ్యంగా దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్ర మార్కెట్లోకి ఈ కార్లను పెద్ద ఎత్తున తీసుకొస్తున్నాయి.

గతంలో మహీంద్ర ఎక్స్‌యూవీ 300 పేరుతో తీసుకొచ్చిన కారుకు మంచి ఆదరణ లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహీంద్ర ఈ కారుకు అప్‌గ్రేడ్‌ వెర్షన్‌గా మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ పేరుతో మార్కెట్లోకి కొత్త కారును తీసుకొచ్చింది.

ఈ కారు అమ్మకాలు ఓ రేంజ్‌లో సాగుతున్నాయి. ఈ కారును మొత్తం 9 వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. పెట్రోల్, డీజిల్ పవర్‌ట్రెయిన్‌ల వెర్షన్స్‌లో తీసుకొచ్చిన ఈ కారుకు ఇండియన్‌ మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది. దసరా సీజన్‌లో ఈ కారు బుకింగ్స్‌ ఓ రేంజ్‌లో పెరిగిపోయి. దీంతో వెయిటింగ్ పీరియడ్ కూడా భారీగా పెరిగింది. ఈ కారుకు క్రేజ్‌కు ఇదే నిదర్శనమని మార్కెట్ వర్గాలు తెలిపాయి.

ఇదిలా ఉంటే మహీంద్ర ఎక్స్‌యూవీ 3×0 ధర విషయానికొస్తే పెట్రోల్ వేరియంట్ బేస్‌ ప్రైజ్‌ రూ. 7.79 లక్షల బేస్ వేరియంట్‌గా ఉంది. అయితే ఇందులో టాప్‌ ఎండ్‌ మోడల్‌ రూ. 15.48 లక్షల వరకు ఉంది. ఇక డీజిల్‌ విషయానికొస్తే బేస్ వేరియంట్‌ రూ. 9.98 లక్షలు కూడా టాప్‌ ఎండ్‌ రూ. 14.99 ఎక్స్‌ షోరూమ్‌ ప్రైజ్‌ వరక5అందుబాటులో ఉంది. ఇక ఈ కారు ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 10.25 ఇంచెస్‌తో కూడిన డిజిటల్‌ డ్రైవర్‌ డిస్‌ప్లేను.. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించారు.

వైర్‌లెస్‌ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. ఇక భద్రతకు కూడా ఈ కారులో పెద్దపీట వేశారు. ముఖ్యంగా ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 3 పాయింట్ సీట్ బెల్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ సిస్టమ్ వంటి అధునాతన ఫీచర్లను అందించారు. అలాగే ఇందులో లెవల్ 2 ADAS టెక్నాలజీ, 360 డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, ఫ్రంట్ రాడార్ సెన్సార్‌ను ఇచ్చారు. 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.2 లీటర్ TGDi పెట్రోల్ ఇంజన్ ఈ కారు సొంతం. అలాగే 1.2 లీటర్ డీజిల్ ఇంజన్‌ను అందించారు. ఇది గరిష్టంగా 115bhp శక్తిని, 300Nm గరిష్ట టార్క్‌ ప్రొడ్యూస్‌ చేస్తుంది.