Manchu Manoj : బాలయ్య కూతురు బ్రాహ్మణిని కొట్టిన మంచు మనోజ్, వార్నింగ్ ఇచ్చిన వసుంధర..

మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్.. నారా బ్రాహ్మణిని కొట్టాడట. ఈ విషయం తెలిసిన బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి.. మనోజ్ కి వార్నింగ్ ఇచ్చిందట. మోహన్ బాబు-మనోజ్ మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ఈ ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది.


మంచు ఫ్యామిలీలో సంక్షోభం నెలకొంది. మోహన్ బాబు చిన్న కుమారుడు మనోజ్.. తండ్రి పై న్యాయపోరాటం చేస్తున్నారు. ఆస్తుల పంపకాల విషయంలో తలెత్తిన వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పరస్పరం దాడులు సైతం చేసుకున్నారు. ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు. గాయాలతో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చిన మనోజ్.. చికిత్స చేయించుకుని వెళ్లారు. మోహన్ బాబు నివాసం ఉంటున్న జుల్పల్లి ఫార్మ్ హౌస్ వద్ద ఇటీవల పెద్ద హైడ్రామా చోటు చేసుకుంది.

మోహన్ బాబు-మనోజ్ రోడ్డున పడి దుర్భాషలాడుకున్నారు. అక్కడ యుద్ధ వాతావరణం నెలకొనడంతో రాచకొండ ఎస్పీ ఇద్దరినీ పిలిచి హెచ్చరించాడు. తాజాగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎదుట విచారణకు హాజరయ్యారు. మేజిస్ట్రేట్ హోదాలో మోహన్ బాబు-మనోజ్ లను కలెక్టర్ విచారించారు. కలెక్టర్ ఎదుటే దూషణలకు దిగినట్లు సమాచారం.

తన ఆస్తులతో మనోజ్ కి సంబంధం లేదు. అతను వాటిని వీడి వెళ్లిపోవాలని మోహన్ బాబు కోరుతున్నారు. ఈ వివాదం ఇలా ఉండగా.. ఓ ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. బాలకృష్ణ పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణిని మనోజ్ కొట్టాడట. దాంతో వసుంధర మనోజ్ ని మందలించిందట. అయితే.. ఈ సంఘటన ఇప్పటిది కాదు. ఎన్టీఆర్ కుటుంబంతో మోహన్ బాబుకు బలమైన అనుబంధం ఉండేది. అన్నగారు అంటూ.. మోహన్ బాబు ప్రేమగా సంబోధించేవాడు.

ఈ క్రమంలో ఇరు కుటుంబాలు తరచుగా కలుస్తూ ఉండేవి. బాల్యంలో బ్రాహ్మణిని మనోజ్ కొట్టాడట. ఈ విషయం తెలిసిన వసుంధర.. తప్పని మనోజ్ ని మందలించిందట. అన్ స్టాపబుల్ షోలో ఈ విషయం బాలయ్య బయటపెట్టాడు. ఓ ఎపిసోడ్ కి గెస్ట్స్ గా మోహన్ బాబు, విష్ణు, మంచు లక్ష్మి వచ్చారు. అప్పుడు మాటల్లో మాటగా ఈ ఘటన చర్చకు వచ్చింది. అదన్నమాట సంగతి..

ఇక మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ లతో కలిసి భైరవం టైటిల్ తో ఒక మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతుంది. సోలో హీరోగా కొన్ని ప్రాజెక్ట్స్ సెట్స్ పై ఉన్నాయి. మనోజ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా కాలం అవుతుంది. 2023లో ఆయన భూమా మౌనికను వివాహం చేసుకున్నారు.