మామిడి ఆకులతో ఇన్ని ప్రయోజనాలా.. తెలిస్తే అస్సలు వదలిపెట్టరు..

www.mannamweb.com


మామిడి పండ్లు అంటే ఇష్టం లేని వారు ఉండరు. సాధారణంగా అన్ని కాలాల్లో ఏదో ఒక పండు మార్కెట్‌లోకి వస్తూనే ఉంటుంది. అయితే వాటిని తిన్నా, తినకపోయినా.. వేసవిలో వచ్చే మామిడి పండును మాత్రం రుచి చూడకుండా వదలిపెట్టరు. రుచికరంగా ఉంటూ అనేక పోషకాలు కలిగి ఉండడంతో చిన్నా, పెద్దా అంతా లొట్టలేసుకుని మరీ ఆరగిస్తుంటారు. అయితే పోషకాలు పండులోనే కాదు.. మామిడి ఆకుల్లోనూ పుష్కలంగా ఉన్నాయి. వాటిని తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి, ఆకులను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇన్ని ప్రయోజనాలా..!

మామిడి ఆకుల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇచ్చే పోషకాలు దాగి ఉన్నాయి. మామిడి ఆకులతో టీ చేసుకుని తాగితే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. జీర్ణకోశ సమస్యలు ఉన్నవారు మామిడి ఆకుల టీ తాగితే ఉపశమనం లభిస్తుంది. వీటిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని విషతుల్య మలినాలను బయటకు పంపిస్తాయి. ఊబకాయం సమస్యతో బాధపడుతున్న వారికి ఈ ఆకులు దివ్య ఔషధమనే చెప్పాలి. మామిడి ఆకులు జీవక్రియ రేటును పెంచి బరువు తగ్గేందుకు దోహదపడతాయి. అలాగే మామిడి ఆకుల టీతో డయాబెటిస్ అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయి తగ్గించి షుగర్ వ్యాధిని కంట్రోల్ చేస్తుంది.

ఎలా తీసుకోవాలంటే..

అయితే మామిడి ఆకులను ఎలా పడితే అలా తీసుకోకూడదు. దానికి ప్రత్యేకమైన పద్ధతులు ఉన్నాయి. మామిడి ఆకులను నీటిలో మరిగించి కషాయంగా తీసుకోవచ్చు. మామిడి ఆకులతో టీ చేసుకుని తాగొచ్చు. అలాగే ఆకులను మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకుని శరీరంపై రాసుకుంటే చర్మం కాంతివతంగా మారుతుంది. అయితే మామిడి ఆకులు వినియోగించాలని భావిస్తే వైద్యుల సలహా తప్పక తీసుకోండి.