ఇప్పటివరకు రోడ్డెక్కి రచ్చ చేసిన మంచు మనోజ్.. ఇప్పుడు సోషల్ మీడియాలోకి దిగాడు. మంచు విష్ణుపై మాస్ ట్రోలింగ్ చేయడానికి కంకణం కట్టుకున్నాడు.
ఉదయం నుంచి మంచు బ్రదర్స్ మధ్య ట్వీట్ల యుద్ధం నడుస్తోంది. ఉదయమే మంచు విష్ణు.. మనోజ్ ను ఉద్దేశించి రౌడీ సినిమాలోనిఫేమస్ డైలాగ్ ను పోస్ట్ చేశాడు. ” సింహం అవ్వాలని ప్రతి కుక్కకు ఉంటుంది. కానీ, వీధిలో మొరగడానికి, అడవిలో గర్జించడానికి ఉన్న తేడా.. కనీసం వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటావని ఆశ” అని మోహన్ బాబు చెప్పే డైలాగ్ ను షేర్ చేస్తూ.. ఇది తన ఫేవరేట్ సినిమా అని చెప్పుకొచ్చాడు.
డైలాగ్ బాగానే ఉంది కానీ, ఈ సమయంలో ఎందుకు పోస్ట్ చేశాడు అనే అనుమానం ప్రేక్షకుల్లో రాలేదు. ఎందుకంటే గత మూడు రోజుల నుంచి మంచు బ్రదర్స్ మధ్య గొడవలు మళ్లీ మొదలైన విషయం తెల్సిందే. పెద్దల సమాధులకు దండం పెట్టుకొని వెళ్ళిపోతాను అన్నా కూడా విష్ణు ఇంటి లోపలి రానివ్వకపోవడమే కాకుండా మనోజ్ పై బౌన్సర్లతో దాడి చేయించాడు. ఆ తరువాత ఇద్దరు అన్నదమ్ములు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఇక్కడితో ఈ సమస్య ముగిసింది అనుకొనేలోపు.. ఇప్పుడు విష్ణు మళ్లీ మనోజ్ ను రెచ్చగొట్టాడు.
రెచ్చగొడితే రెచ్చిపోతారండీ అని డైలాగ్ లా మనోజ్ రెచ్చిపోయాడు. విష్ణు వేసిన ట్వీట్ కు కౌంటర్ల మీద కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టాడు. విష్ణు అయినా ఇన్ డైరెక్ట్ గా కుక్క అన్నాడేమో కానీ, మనోజ్.. ఏకంగా అన్న పేరు పెట్టే కుక్కవు నువ్వేరా అని చెప్పుకొచ్చాడు.
Manchu Manoj: కన్నప్ప తీసినంత మాత్రానా సింహం కాలేవురా కుక్క.. డైరెక్ట్ గానే ఇచ్చిపడేసిన మనోజ్
” కన్నపలో రెబల్‌స్టార్ కృష్ణంరాజు గారు లాగా సింహం అవ్వాలి అని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావ్” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక దీనికింద విష్ణుకే ఈ కౌంటర్ అనేలా విస్మిత్ , హాలీవుడ్ వెంచర్ అని క్లూలు కూడా ఇచ్చాడు.
ఇక్కడితో మనోజ్ ఆగలేదు. ఇంకా రెచ్చిపోయాడు. మోహన్ బాబు నటించిన ఒక సినిమాలోని క్లిప్ ను ఇంకో పోస్ట్ లో షేర్ చేశాడు. ఈ వీడియోలో మోహన్ బాబు తన ఆస్తిని తనకు ఇవ్వాలని విలన్స్ తో గొడవపడుతున్నట్లు కనిపిస్తుంది. జయ ప్రకాష్ రెడ్డి ” ఇంతకు నీకేం కావాలిరా” అని అడగ్గా మోహన్ బాబు మాట్లాడుతూ.. ” బలవంతంగా తన్ని, కొట్టి, చంపుతాను అని బెదిరించి నేను తెచ్చి ఇచ్చిన 40 దస్తావేజులు నాకు కావాలి” అని చెప్తాడు. ఇక ఇంకో విలన్ బసవా.. కాలు దున్నవుతున్నావా అని మోహన్ బాబుకు వార్నింగ్ ఇస్తాడు. దానికి మోహన్ బాబు ఇంకో డైలాగ్ చెప్తాడు. ” నేను కాలు దువ్వాలనుకుంటే.. అడుగు పెట్టగానే నీ తల నరికి నీ పెళ్లాం ఒళ్లో వేసేవాడిని. నా ఆలి చెప్పింది కాబట్టి.. గొడవలు మానేయ్.. చేసిన పాపం కడిగేసుకోవడానికి వచ్చాను” అని చెప్పుకొచ్చాడు.
నిజం చెప్పాలంటే ఈ ఒక్క వీడియోలోనే మంచు కుటుంబం గొడవ తెలుస్తుంది. మోహన్ బాబు ప్లేస్ లో మనోజ్ ఉన్నాడు. మౌనికను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని మోహన్ బాబు, విష్ణు.. మనోజ్ పై దాడికి పాల్పడ్డాడు. తమ్ముడినే చంపడానికి ప్లాన్ చేసాడు. ఇప్పుడు ఈ వీడియో చూసిన అభిమానులు ఎందుకన్నా.. ఇంత మాస్ ట్రోలింగ్ చేస్తున్నావ్ అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ట్రోలింగ్ పై విష్ణు ఎలా స్పందిస్తాడో చూడాలి.