యాలకులు జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఇవి ఆకలిని పెంచి, జీర్ణ సమస్యలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఇవే కాకుండా ఇందులో ఉండే మూలకాలు జీర్ణక్రియ రేటును కూడా పెంచుతాయి.
యాలకుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచి, సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి ఇన్‌ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. యాలకుల్లో రైబోఫ్లావిన్, నియాసిన్ అనే మూలకాలు ఉంటాయి. కాబట్టి ప్రతి రోజు ఈ పాలను తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
యాలకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి. ఇవి రక్తనాళాలను శుభ్రపరచి, రక్తపోటును నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవే కాకుండా గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు కూడా దూరమవుతాయి.
యాలకులు శ్వాసకోశ వాపును తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి. దీంతో పాటు గొంతు నొప్పి, ఆస్తమా వంటి సమస్యలను నివారించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
అలాగే పొట్టలో కొవ్వు పేరుకుపోకుండా యాలకుల టీ సహాయపడుతుంది. శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండె సమస్యలను పెంచుతుంది. కాబట్టి, మీరు క్రమం తప్పకుండా ఏలకుల టీ తాగితే, మీరు ఈ చెడు కొలెస్ట్రాల్‌ను సులభంగా వదిలించుకోవచ్చు. ముఖ్యంగా, ఏలకుల టీ ఒత్తిడిని తగ్గిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.