ఈ రోజుల్లో ఐఫోన్ చాలా మంది వాడుతున్నారు. చాలా ఖరీదైన ఫోన్ అయినప్పటికీ.. ఈఎంఐలో కొని మరీ ఒక స్టేటస్ సింబల్‌లా దాని వాడుతున్నారు. ఐఫోన్ కెమెరా, ఇతర లక్షణాలు ఇతర ఫోన్ కంటే మెరుగ్గా ఉన్నాయి.
అందుకే ప్రజలు ఐఫోన్ కొనడానికి ఇష్టపడతారు. ప్రస్తుతం ఇండియాలో కోట్లాది మంది వద్ద ఐఫోన్ ఉంది. ఐఫోన్‌లను ఆపిల్ కంపెనీ తయారు చేస్తుందని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఐఫోన్‌లో చాలా మందికి ఐ అంటే ఏంటో తెలిసి ఉండదు.
ఐఫోన్ పేరులోని ఇంగ్లీషు అక్షరం i కి అర్థం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆపిల్ తన మొబైల్ ఫోన్లకు పేరు పెట్టేటప్పుడు i అనే అక్షరాన్ని ఊరికే ఉపయోగించలేదు. ఈ అక్షరానికి ఒక ప్రత్యేక అర్థం ఉంది. ఐఫోన్ అనే పేరులోని i అంటే ఇంటర్నెట్ అని చాలా మంది అనుకుంటారు. కానీ అది తప్పు. ఈ అక్షరాన్ని పరిశీలిస్తే దానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఆపిల్ కంపెనీ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఐఫోన్ అనే పేరులోని i అనే అక్షరానికి అర్థాన్ని వివరించారు. స్టీవ్ జాబ్స్ ప్రకారం.. ఐఫోన్ పేరులోని i అంటే ఇంటర్నెట్, ఇండివిజువల్, ఇన్‌స్ట్రక్ట్, ఇన్‌ఫార్మ్, ఇన్‌స్పైర్. అంటే ఒక అక్షరం వెనుక ఐదు దృక్కోణాలు, ఉద్దేశ్యాలు దాగి ఉన్నాయి.
































