రిచ్, మిడిల్ క్లాస్, పూర్ తరగతుల వారి అవసరాలకు తగ్గట్లుగా కార్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. రిచ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు..
లీటరుకు పది కిలో మీటర్లు అయినా లెక్క చేయరు. ఇక మిడిల్ క్లాస్ నష్టం జరగకుండా జాగ్రత్త పడతారు. ఇక పూర్ అయితే ఫోర్ వీలర్ కొనాలంటేనే జంకుతారు. ఒక వేళ కొన్నా రూపాయికి పది రూపాయల మేలు చేసేదై ఉండాలి. మిడిల్ నుంచి పూర్ క్లాస్ వారి కోసం కొన్ని కంపెనీలు మంచి మంచి కార్లను అందుబాటులోకి తెస్తున్నాయి. అందులో మారుతీ సుజుకీ, టాటా, మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీలు ముందు వరుసలో ఉన్నాయి. సర్వీస్, మైలేజ్ పరంగా చూసుకుంటే మారుతీ సుజుకీ పేద వారికి కూడా బెస్ట్ కారని చెప్పవచ్చు. భారత్ లో ఆటోమొబైల్ కంపెనీల్లో దిగ్గజంగా ఎదిగింది మారుతీ సుజుకీ. అమ్మకాల పరంగా ప్రతీ ఏటా ది బెస్ట్ అనిపించుకుంటుంది. మధ్య తరగతి వారి కోసం మంచి మంచి మోడళ్లను అందుబాటులోకి తేవడంతో ఇండియాలో మంచి కంపెనీగా గుర్తింపు దక్కించుకుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో రిలీజ్ చేసిన కొన్ని మోడళ్లు ఏడాది చివరికల్లా ఎక్కువ అమ్మకాలు చేపట్టడంతో 2024లో కూడా ది బెస్ట్ కంపెనీగా నిలిచింది. కంపెనీ ఇటీవల రిలీజ్ చేసిన డేటాను పరిశీలిస్తే.. ఈ ఏడాది (2024) నవంబర్ లో 1,41,312 యూనిట్ల వాహనాలను విక్రయించింది. గతేడాది 2023, నవంబర్ లో 1,34,158 యూనిట్లు కంటే అధనంగా విక్రయించింది.
ఏడాదిని పరిశీలించినట్లయితే నవంబర్ లో అమ్మకాల వృద్ధి 5 శాతంగా ఉంది. ఇతర వాహన తయారీదారులు పోటా పోటీగా కొత్త మోడళ్లను రిలీజ్ చేస్తూ.. మారుతీ కంపెనీ కంటే ఎక్కువ అమ్మకాలు నమోదు చేయాలని ప్రయత్నించినప్పటికీ దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు మారుతీకే జై కొట్టారు. అందుకే అమ్మకాల జాబితాలో నెం. 1 స్థానాన్ని దక్కించుకుంది.
మారుతీ విక్రయాల్లో ప్రధానంగా ‘వ్యాగన్ R’ కీలకపాత్ర పోషించింది. నవంబర్ లో వినియోగదారులు ఈ కారువైపే ఎక్కువగా మొగ్గు చూపారు. డేటా ప్రకారం.. ఈ ఏడాది నవంబర్‌లో ఈ మోడల్ 13,982 యూనిట్లు ఉన్నాయి, అక్టోబర్‌లో 13,922 కార్లను అమ్మింది. పండుగ సీజన్ లో ఎక్కువగా అమ్మకాలను సాధించిన వ్యాగన్ R పండుగ ఆఫర్లు లేకపోయినా కూడా నవంబర్‌లో ఎక్కువ కార్లను అమ్మి మార్కెట్లో ఆధిపత్యం దక్కించుకుంది.
మారుతీ సుజికీలో వచ్చే వ్యాగన్-R VXi, LXi, ZXi+, ZXi అనే 4 వేరియంట్లలో పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. CNG కూడా ఉంది. ఇండియాలో దీని ప్రారంభ ధర రూ. 5.55 లక్షల నుంచి మొదలవుతుంది. టాప్ వేరియంట్ ధర రూ. 7.33 లక్షలు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ధర తక్కువైనా ఫీచర్లు ఎక్కువ, మైలేజ్ కూడా ఎక్కువగానే ఉండడంతో ఎక్కువ మంది ఈ కారు వైపునకు మళ్లుతున్నారు.