హిందూ సంప్రదాయంలో అమావాస్యకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. అందులోనూ మాఘ మాస అమావాస్య అయితే ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. చొల్లంగి అమావాస్య చాలా శక్తివంతమైనది.
ఈరోజు చేసే పనులలో తగిన జాగ్రత్త తీసుకోవడం అవసరం. అప్పుడే దరిద్ర దేవతకు దూరంగా ఉండి లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. శాస్త్రానికి విరుద్ధంగా నడుచుకుంటే దరిద్రం పట్టిపీస్తుంది.
పుష్యమాసంలోని కృష్ణపక్ష అమావాస్య తిథిని చొల్లంగి అమావాస్య లేదా మోని అమావాస్య అంటారు. ఈ సంవత్సరం మోని అమావాస్య జనవరి 29 బుధవారం వస్తోంది. ఏడాది పొడవున వచ్చే అమావాస్యలలో చొల్లంగి అమావాస్యకు విశేష ప్రాధాన్యత ఉందని గ్రంథాలలో చెప్పారు.
ఈరోజున ఈ పనులు అసలు చేయొద్దు :
అమావాస్య రోజున తమ మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున మీ మాటలు మనసుపై నిగ్రహాన్ని కలిగి ఉండాలి. మోని అంటే మౌనంగా ఉండటం.. అంటే స్నానం చేయడానికి ముందు ఏమి మాట్లాడకుండా ఉండాలి. చేతల ద్వారా ఎవరికి కీడు చేయకూడదు. వాగ్వాదం తగాదాలకు దూరంగా ఉండాలి. చల్లంగి అమావాస్య రోజున మౌనం పాటించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది.
ఈ రోజున పొరపాటున కూడా ఎవరిని మోసం చేయకూడదు. ఈరోజు మీరు ఏదైనా తప్పుడు పని చేస్తే.. అనేక పాపాల్లో భాగస్వామ్యం కావాల్సి వస్తుంది. ఈ పవిత్రమైన రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు. అలా కాకుండా ఆలస్యంగా నిద్రలేవటం వల్ల దరిద్ర దేవత ఆవహిస్తుందని చెబుతారు. ఇలాంటి అలవాటు ఉన్నవారికి అత్యంత త్వరగా ప్రతికూల శక్తిని ప్రభావం చేసే అవకాశం ఉంటుంది.
చొల్లంగి అమావాస్య రోజు వేకువజామున నిద్రలేవాలి అంటే.. సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. ఈ రోజున సాధన తపస్సు చేయడం ద్వారా భగవంతుని అనుగ్రహం పొందాలి. మోని అమావాస్య రోజున సాధ్యమైనంత త్వరగా నిద్ర లేచేందుకు ప్రయత్నించాలి. అమావాస్య రోజున స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
ఈ రోజున స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అధ్యయనం ఇవ్వడాన్ని అస్సలు మర్చిపోవద్దు. అలాగే స్నానం చేసేంతవరకు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండాలి. చొల్లంగి అమావాస్య రోజు తల్లిదండ్రులు లేనివారు పెద్దల పేర్లు పెట్టి తర్పణాలు జలముతో వదలకపోవడం కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది.
శాస్త్రం ప్రకారం.. స్నానం చేసిన వెంటనే పెద్దలకు తర్పణాలు జలముతో వదిలిపెట్టాలి. చొల్లంగి అమావాస్యనాడు పూర్వీకులు వచ్చి పవిత్ర నదిలో స్నానం చేస్తారని నమ్ముతారు. అమావాస్య రోజు తలస్నానం చేయొచ్చు కానీ, తలంటుకోరాదు. తలంటుకోవడం దరిద్రాన్ని కలిగిస్తుంది.
చొల్లంగి అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది. చొల్లంగి అమావాస్య మధ్యాహ్నం ఒక్కరోజు నిద్రించకపోవడం మంచిది. అమావాస్య రోజు రాత్రి భోజనం చేయుట కూడా దరిద్ర శత్రువుగా భావిస్తారు.
అమావాస్య రోజు తలుపు నూనె రాసుకోవడం మంచిది కాదు. ఇది దరిద్రానికి దారి తీస్తుంది. అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం చేయరాదు. ఇలా చేస్తే దరిద్రానికి దారితీస్తుంది.
అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించకపోవడం కూడా దరిద్ర హేతువుగా పరిగణిస్తారు. వృద్ధులను పేదవారిని అవమానించకూడదు. ఈ రోజున ఎవరితోనూ గొడవపడకూడదు. అనవసరమైన చర్చలు చేయకూడదు. దుష్ట సంకల్పాలు పెట్టుకోకూడదు. ఎవరిని శపించకూడదు లేదా తిట్టకూడదు.
అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు. చొల్లంగి అమావాస్యనాడు పొరపాటున కూడా ఈ పని చేయకూడదు. ప్రధానంగా మాంసం తినడం అబద్ధాలు చెప్పడం మానుకోవాలి.
ఈరోజు ఏం చేస్తే మంచి పలితాలు ఉంటాయంటే? :
ఈ రోజున ఎవరైనా గంగా స్నానం చేసి దానం చేస్తే ఆయుష్షు పెరుగుతుంది. ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందుతారని భక్తుల నమ్మకం. జీవితంలో శాంతి శ్రేయస్సు వస్తాయి. జీవితంలో సమస్యలు అడ్డంకులు తొలగిపోతాయి. తలస్నానం చేయకపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది. తలస్నానం చేయడం మంచిది. అయితే. మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఫలహారాలను తీసుకోవడం ఉత్తమం.
కనుక ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం మంచిది. ఈరోజు పితృదేవతలను నమస్కరించుకుని వారి అనుగ్రహం పొందాలి. పితృ దేవతలను నమస్కరించకపోతే దరిద్రం కలుగుతుంది. శాస్త్రం ప్రకారం నడుచుకుంటే శుభ ఫలితాలను పొందగలుగుతారు. చొల్లంగి అమావాస్య రోజున పిండిలో పంచదార కలిపి దానిని చీమలకు ఆహారంగా అందించండి. ఇలా చేయడం వలన పితృ దోషాలు తొలగిపోవడం కాకుండా వారి ఆశీస్సులతో కోరిన కోరికలు నెరవేరుతాయి.
పితృ దోషం పోవాలంటే చొల్లంగి అమావాస్య రోజున మీ పూర్వీకులను స్మరించుకుని ఆ రోజున సూర్య భగవానుడికి అర్థం సమర్పించండి. అంతేకాకుండా రాగి పాత్రలో నల్ల నువ్వులు ఎదుటి పువ్వులను నీటిలో కలిపి ఈ నీటితో సూర్యభగవానుడికి సమర్పించండి.
అమావాస్య రోజున పవిత్ర నదిలో స్నానం చేసి నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా పూర్వీకులు సంతృప్తిచెందుతారని భావిస్తారు. పితృ దోషం నుంచి విముక్తి పొందుతారని నమ్మకం. చొల్లంగి అమావాస్య రోజున తప్పనిసరిగా నల్ల నువ్వుల లడ్డులు నువ్వుల నూనె దుప్పటి ఉసిరికాయలు నల్లని వస్త్రాలను పేదవారికి దానం చేయాలి. ఇలా చేయడం వల్ల పితృ దోషం తొలగిపోతుంది.
దుప్పటి ఉసిరికాయలు నల్లని వస్త్రాలను పేదవారికి దానం చేయాలి. ఇలా చేయడం వల్ల వితృ దోషం తొలగిపోతుంది. ఈ రోజున రావి చెట్టుకు తెల్లటి మిఠాయిలను సమర్పించాలి. రావిచెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయండి. ఇలా చేయడం వల్ల ఈ పూర్వీకుల ఆశీస్సులు మీకు లభిస్తాయి.
చొల్లంగి అమావాస్య రోజున ఇంటిదక్షిణ దిశలో తెల్లటి గుడ్డ పైన నల్ల నువ్వులను నుంచి ఇత్తడి లేదా రాగిపై పితృ యంత్రాన్ని అమర్చండి. అనంతరం కుడి వైపున పూర్వీకులను స్మరిస్తూ నువ్వుల నూనె దీపం వెలిగించాలి. మధ్యలో నీటితో నింపిన స్టీల్ పాత్రను ఉంచండి. దానిపై స్టీల్ ప్లేట్ మీద నువ్వుల గింజలతో తయారు చేసిన ఆహారాన్ని ఉంచండి. అనంతరం ఆహారంపై తులసి ఆకులను ఉంచండి.
తెల్లటి పుష్పాన్ని సమర్పించండి. ఈ నైవేద్యంలో కొంత భాగాన్ని కుక్కకు అందించి మిగిలిన దానిని రావి చెట్టు కింద ఉంచండి. ఇలా చేసే సమయంలో మాట్లాడకుండా మౌనంగా ఉండాలి. చొల్లంగి అమావాస్యను కోటి జన్మలో పాప హారినిగా వర్ణిస్తారు. ఈ చొల్లంగి అమావాస్య చాలా విశేషమైనది.
శ్రీమహావిష్ణువు వైద్య నారాయణడిగా ఆవిర్భవించిన రోజు కూడా ఈ చొల్లంగి అమావాస్యమే. అందుకే ఈ రోజున ఎంతో భక్తిశ్రద్ధలతో విష్ణువును పూజిస్తామో, అంత చక్కని ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతుంది. ఈ అమావాస్యకి రోగహరణ శక్తి ఉంటుందని మన పెద్దలు చెబుతున్నారు.
అలాగే రాళ్ల ఉప్పు బెల్లం ఎవరికి వారు ముమ్మారు దిష్టి తీసే విధంగా తిప్పుకొని నీటి కలశంలో లేదా నీటిపాత్రలో గాని వేయాలి. ఇలా చేయడం ద్వారా దృష్టి దోష ప్రభావం తగ్గుతుంది. అపమృతి దోషాలు సైతం తగ్గుతాయి.
ఇలా ఇంట్లో వాళ్ళు అందరు చేయవచ్చు లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ చొల్లంగి అమావాస్యనాడు ఒక ప్లేట్ తీసుకొని కొంచెం బియ్యం పిండి పంచదారని చూర్ణంగా చేసుకుని దానికి కొంచెం యాలకులు పొడి కలిపి ఆవు నెయ్యి వేసి విష్ణు సహస్రనామం పారాయణం చేస్తూ దీపం పెట్టాలి.
అలా దీపం పెట్టిన పదార్థాన్ని దీపం కొండెక్కిన తర్వాత దాని ఇంట్లో ప్రతి ఒక్కరూ ప్రసాదంగా తీసుకోవడం చాలా మంచిది. అమావాస్య రోజు వీలైనంత ఎక్కువమంది నిరుపేదలకు సహాయం చేయాలి. అమావాస్య తిథినాడు బిచ్చగాడు మీ ఇంటికి వస్తే అతనిని ఉత్తిచేతులతో తిప్పి పంపకండి.