ఉదయం నిద్ర లేవగానే ఈ పరిహారాలు చేయండి.. లక్ష్మీ దేవి ఆశీస్సులు మీకు లభిస్తాయి.

హిందూ మతంలో లక్ష్మీదేవిని సంపదకు దేవత అని పిలుస్తారు. లక్ష్మీదేవి ఆశీస్సులు ఉన్న వ్యక్తి లేదా ఇల్లు ఎప్పుడూ ఆర్థిక సమస్యలను ఎదుర్కోదని నమ్ముతారు.


జ్యోతిష్యం ప్రకారం ఉదయం నిద్రలేచిన తర్వాత కొన్ని ప్రత్యేకమైన, సులభమైన పరిహారాలు చేయడం ద్వారా లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది. ఉదయం నిద్రలేచిన తర్వాత ముందుగా ఏమి చేయాలో ఈ రోజు తెలుసుకుందాం.. వీటిని పాటించడం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది.

అరచేతుల దర్శనం: ఉదయం నిద్రలేవగానే ముందుగా మీ అరచేతులను చూడాలి. అరచేతులను చూసిన తర్వాత “కరాగ్రే వసతే లక్ష్మీ: కరమధ్యే సరస్వతీ. కరమూలే స్థితో బ్రహ్మా ప్రభాతే కరదర్శనం” అనే మంత్రాన్ని జపించాలి. అరచేతులలో లక్ష్మీదేవి, సరస్వతి దేవి ,బ్రహ్మ దేవుడు నివసిస్తారని నమ్ముతారు.

సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం: ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత రాగి పాత్రలో సింధూరం, పువ్వులు, అక్షతం వేసి సూర్యుడికి అర్ఘ్యం అర్పించాలి. అలాగే “ఓం సూర్యాయ నమః, ఓం భనవే నమః, ఓం ఖగాయ నమః” అనే మంత్రాన్ని జపించాలి.

తులసి పూజ:- ఉదయం నిద్రలేచి స్నానం చేసిన తర్వాత తులసి మొక్కను పూజించాలి. తులసి మొక్కకు నీటిని కూడా సమర్పించాలి. తులసిలో లక్ష్మీదేవి నివసిస్తుందని మతపరమైన నమ్మకం. కనుక తులసి మొక్కను రోజూ పూజించడం వల్ల లక్ష్మీదేవి ఇంటిలో నివసిస్తుందని నమ్మకం.

ప్రధాన ద్వారం వద్ద ముగ్గు- ఉదయం నిద్రలేచి స్నానం చేసిన తర్వాత ప్రధాన ద్వారం వద్ద నీరు చల్లి ముగ్గు వేయండి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని నమ్ముతారు. దీనితో పాటు ఉదయం ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించాలి.. తద్వారా సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశించి లక్ష్మీదేవి అక్కడ నివసిస్తుంది.

ప్రధాన ద్వారం వద్ద నీటి పాత్ర : ఇంటి ప్రధాన ద్వారం దగ్గర రాగి పాత్రలో నీరు పోసి పెట్టండి. అందులో ఎరుపు రంగు పువ్వులు వేయడం వలన లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని నమ్ముతారు.

ప్రధాన ద్వారంపై స్వస్తిక్:- హిందూ మత విశ్వాసం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారంపై స్వస్తిక్ వేయడం శుభప్రదం.ఎందుకంటే ఇంట్లోకి సానుకూల శక్తిని ప్రవేశించేలా చేస్తుందని నమ్మకం. అంతేకాదు ఇంటి నుంచి ప్రతికూల శక్తిని దూరంగా ఉంచుతుంది. ఉదయం నిద్రలేచిన తర్వాత ప్రధాన ద్వారంపై స్వస్తిక్ వేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.