మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej), లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) పలు చిత్రాల్లో జంటగా నటించి ప్రేమలో పడ్డారు. కొద్ది కాలంపాటు వీరిద్దరు ప్రేమించుకుని ఫుల్ ఎంజాయ్ చేశారు.
సీక్రెట్‌గా లవ్ ట్రాక్ నడిపిన ఆ జంట 2023లో పెద్దలను ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్నారు. అదే ఏడాది ఇటలీలోని టస్కానిలో వీరిద్దరు నవంబర్ 1న ఏడడుగులు వేశారు. ఇక పెళ్లైన రెండేళ్ల తర్వాత 2025 మే నెలలో తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు మెగా కపుల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి లావణ్య త్రిపాఠి సినిమాలకు దూరంగా ఉంటుంది.
అలాగే సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటూ ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, మెగా కోడలు లావణ్య త్రిపాఠి బుధవారం ఉదయం రెయిన్‌బో ఆసుపత్రిలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. అయితే ఈ విషయాన్నిఅధికారికంగా ప్రకటించనప్పటికీ సన్నిహితుల ద్వారా బయటపడటంతో అంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న సినీ సెలబ్రిటీలు, నెటిజన్లు, మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతూ కంగ్రాట్స్ చెబుతున్నారు. అలాగే బాబు ఫొటోను షేర్ చేయాలని సోషల్ మీడియాలో నానా రభస చేస్తున్నారు.
































