పెళ్లి పీటలు ఎక్కనున్న మెగా మేనల్లుడు..కాబోయే భార్య ఎవరంటే?

మెగా ఫ్యామిలీలో వరుసగా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మెగా వారసురాలు క్లింకార పుట్టిన వేళా విశేషం ఏమో.. మెగా ఫ్యామిలీలో వరుస విజయాలతో మునిగితేలుతున్నారు.ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటకు అవార్డు వచ్చింది..


వెంటనే వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత చిరంజీవికి కేంద్రం పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించింది. తర్వాత చిరంజీవి భార్య సురేఖ.. అత్తమ్మ కిచెన్ పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించింది.

ఇవన్నీ ఒక ఎత్తైతే ఎప్పటినుంచో అభిమానులు కలలు కంటున్న పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే అవడం జరిగిపోయింది. పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందడమేకాదు.. మంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఇక ఈ సెలబ్రేషన్స్ ఇప్పుడప్పుడే ఆగేలా లేవు.

అవును.. మెగా ఇంట్లో మరో వేడుకకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. అదేంటంటే.. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్.. రేయ్ చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టినా పిల్లా నువ్వులేని జీవితం చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.

ఇక ఈ సినిమా తేజ్ కు మంచి పేరుతో పాటు అవకాశాలను కూడా తీసుకొచ్చి పెట్టింది. విజయాపజయాలను పక్కన పెట్టి వరుస సినిమాలను చేసుకుంటూ పోతున్నాడు. ఈ నేపథ్యంలోనే తేజ్ జీవితంలో అనుకొని మలుపు తిరిగింది. బైక్ యాక్సిడెంట్ కు గురై చావు అంచుల వరకూ వెళ్లి వచ్చాడు.

ఇక ఆ తరువాత విరూపాక్ష సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తరువాత గాంజా శంకర్ సినిమా ప్రకటించాడు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతుంది అనుకొనేలోపు ఈ సినిమా ఆగిపోయింది.

ఇక ప్రస్తుతం సినిమాల గురించి పక్కన పెట్టి కళ్యాణ్ మామ మంత్రి అయిన సంతోషంలో మునిగితేలుతున్న తేజ్.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి పెద్దలు అన్ని విషయాలు మాట్లాడుకుంటున్నట్లు సమాచారం. ఎవరిని చేసుకోబోతున్నాడు? అనే విషయాన్ని త్వరలోనే వెల్లడించనున్నట్లు సమాచారం. వధువు కూడా ఒక బిజినెస్ మ్యాన్ కూతురు అని టాక్. మెగా కుటుంబానికి కూడా ఈ సంబంధం నచ్చిందని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.