రెండేసి పెన్షన్లు తీసుకుంటున్న మెగాస్టార్..

మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి నెంబర్ వన్ హీరోగా ఓ వెలుగు వెలిగారు…వెలుగుతున్నారు కూడా.


ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి నెంబర్ వన్ హీరోగా చిరంజీవి నిలిచారు. ఇండస్ట్రీకి చెందిన హీరోల కొడుకులు వారసులుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ వారిని దాటుకుని మరీ నెంబర్ వన్ స్థానాన్ని చిరంజీవి కైవసం చేసుకున్నారు. దాదాపు 30 ఏళ్ల పాటు తెలుగులో టాప్ హీరోగా చిరంజీవి నిలిచారంటే ఆయన స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఒకానొక సమయంలో దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోగా చిరంజీవి నిలిచారు. సినిమాల్లో వచ్చిన క్రేజ్‌తో చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అప్పటికే చాలామంది హీరోలు రాజకీయాల్లోకి వచ్చి ఫెయిల్ అవ్వడాన్ని కళ్లారా చూసి కూడా ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2009 సార్వత్రిక ఎన్నికల ముందు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఎన్నో అంచనాల మధ్య పోటీ చేసిన ప్రజారాజ్యం కేవలం 18 సీట్లలో మాత్రమే విజయం సాధించగలిగింది.

ఆ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన చిరంజీవి ఓ చోట ఓడిపోయి, మరో స్థానంలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. చిరంజీవి తన సొంత నియోజకవర్గం పాలకొల్లులో చిరంజీవి ఓడిపోవడం ఆయన జీవితంలో మాయని మచ్చలా నిలిచింది. దీంతో ఆయన ప్రజారాజ్యం పార్టీని ఎక్కువ కాలం ముందుకు తీసుకెళ్లలేకపోయారు. తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరుఫున రాజ్యసభకు ఎన్నికై కేంద్రమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.

2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే చిరంజీవి తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని ఎప్పుడు ప్రత్యక్షంగా చెప్పింది లేదు. ఇదే సమయంలో ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీలో చోటు కల్పించిన సందర్భంలో కూడా ఆ పదవిని ఖండించలేదు. ఇదిలా ఉంటే చిరంజీవి రెండు పింఛన్లు తీసుకొంటున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.

ఈ వీడియో పాల్గొన్న సదరు వ్యక్తి చిరంజీవి రెండు పింఛన్లు తీసుకొంటున్నారని తెలిపారు. గతంలో ఎమ్మెల్యే పదవితో పాటు, రాజ్య సభ్యుడు కూడా ఉండటంతో చిరంజీవి భారత ప్రభుత్వం నుంచి రెండు పింఛన్లు తీసుకొంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ఇటీవలే గోవా గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన అశోక్ గజపతి రాజు సైతం రెండు పింఛన్లు తీసుకొంటున్నారని ఆ వ్యక్తి ఈ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది.

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ , టీజీ వెంకటేష్ కూడా రెండేసి పెన్షన్లు తీసుకుంటున్నారని తేలింది. పక్కా సమాచారంతోనే తాను ఈ విషయాలను చెబుతున్నానని సదరు వ్యక్తి చెప్పడం విశేషం. అయితే రాజ్యాంగ బద్ధంగా ఈ పింఛన్లు తీసుకోవడానికి వారు అర్హులే అయినప్పటికీ, డబ్బున్న వ్యక్తులు ఇలా ప్రజల పన్నుతో వచ్చిన పింఛన్లు తీసుకోవడం తప్పని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ డబ్బును ప్రజల శ్రేయస్సు కొరకు వినియోగిస్తే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.