కడప(Kadapa)లో టీడీపీ(Tdpai) మహానాడు(Mahanadu) విజయవంతంగా మూడు రోజు సైతం కొనసాగుతోంది. మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా సాగిస్తున్నారు.
ఈసారి కడప వేదికగా మహానాడు నిర్వహించారు. ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు సాగింది. ఈ రోజుతో మహానాడు ముగుస్తుంది. దీంతో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు భారీ ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, మంత్రి నారా లోకేశ్ సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
అటు కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డితో పాటు ఆమె భర్త, టీడీపీ సీనియర్ నేత శ్రీనివాసులు రెడ్డి కూడా హాజరయ్యారు. అయితే వేదికపైకి చేరుకున్న సీఎం చంద్రబాబును హత్తుకొని భావోద్వేగానికి గురయ్యారు. గత ఐదేళ్లలో కడప జిల్లాలో పార్టీ బలోపేతం కోసం ఆయన పడి కష్టం.. ప్రత్యర్థుల కుట్ర, చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను గుర్తు చేసుకుని ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నారు. దీంతో ఆయనను చంద్రబాబు నాయుడు ఓదార్చారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొని నిలబడిన మాధవీ రెడ్డి దంపతులను అభినందించారు.
































