హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. ఆరోజున అర్థరాత్రి తర్వాత కూడా MMTS రైళ్లు

www.mannamweb.com


హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనం కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగుతుందన్న విషయం తెలిసిందే. గణనాథులను వీక్షించేందుకు జంట నగరాల నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు.

ముఖ్యంగా ట్యాంక్‌బండ్‌పై జరిగే నిమజ్జన వేడుకలను వీక్షించేందుకు వస్తుంటారు.

అయితే పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక చర్యలు చేపట్టింది. జంట నగరాల ప్రజలు రాత్రి వరకు నిమజ్జన వేడుకలను వీక్షించేందుకు వీలుగా ఎమ్‌ఎమ్‌టీఎస్‌ ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 17, 18వ తేదీల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఉదయం 4 గంటల వరకు ఈ ప్రత్యేక రైళ్లు సేవలందించనున్నాయి. ఈ రైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

* హైదరాబాద్‌ నుంచి లింగంపల్లి వెళ్లే ట్రైన్‌ నెంబర్‌ జీహెచ్‌ఎల్‌-5 17వ తేదీ 23.10 గంటలకు బయలు దేరి లింగంపల్లికి 23.55 గంటలకు చేరుకుంటుంది.

* ఇక సికింద్రాబాద్‌ నుంచి హైదరాబాద్ వెళ్లే జీహెచ్‌1 నెంబర్‌ రైలు 17వ తేదీ 23.50 గంటలకు బయలు దేరి అర్థరాత్రి తర్వాత 00.20 గంటలకు చేరుకుంటుంది.

* లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్లే జీఎల్‌ఎఫ్‌6 రైలు 18 తేదీన 00.10 గంటలకు బయలుదేరి 01.50 గంటలకు చేరుకుంటుంది.

* హైదరాబాద్‌ నుంచి లింగంపల్లి వెళ్లే జీహెచ్‌ఎల్‌2 రైలు 18 తేదీన 00.30 గంటలకు బయలుదేరి 01.20 గంటలకు చేరుకుంటుంది.

* లింగంపల్లి నుంచి హైదరాబాద్‌ వెళ్లే జీహెచ్‌ఎల్‌2 రైలు 18 తేదీన 01.50 గంటలకు బయలుదేరి 02.40 గంటలకు చేరుకుంటుంది.

* ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే జీఎఫ్‌ఎస్‌7 రైలు 18 తేదీన 02.20 గంటలకు బయలుదేరి 03.00 గంటలకు చేరుకుంటుంది.

* హైదరాబాద్‌ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే జీహెచ్‌ఎస్‌4 రైలు 18 తేదీన 03.30 గంటలకు బయలుదేరి 04.00 గంటలకు చేరుకుంటుంది.

* సికింద్రాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్లే జీహెచ్‌ఎస్‌4 రైలు 18 తేదీన 04.00 గంటలకు బయలుదేరి 04.40 గంటలకు చేరుకుంటుంది.