మహిళలకు భారీ గుడ్ న్యూస్.. రూ.10 లక్షల వ్యాన్.. 4 లక్షలకే

www.mannamweb.com


మహిళల ఉపాధి కల్పనకు, వ్యాపారాల్లో రాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. సావిత్రి భాయి ఫూలే జయంతి సందర్భంగా ఆమెకు నివాళులర్పించిన మంత్రి సీతక్క, ప్రజాభవన్‌లో 25 సంచార చేపల విక్రయ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో “వర్ధిల్లాలి మహిళా శక్తి” అంటూ నినాదాలు చేశారు.

సంచార చేపల విక్రయ వాహనంలో ప్రయాణించి వాటి పనితీరును స్వయంగా పరిశీలించారు మంత్రి సీతక్క. మహిళా సాధికారిత కోసం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని వెల్లడించారు. దేశంలో తొలిసారి సావిత్రి భాయి ఫూలే జయంతిని అధికారికంగా నిర్వహించడం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకత అని తెలిపారు. సావిత్రి భాయి ఫూలే ఇంటికే పరిమితం కాదని, చదువు గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన మహానీయురాలిగా ప్రశంసించారు. ఆడవారికి చదువు అవసరం లేదని భావించే మూఢనమ్మకాలను సావిత్రి భాయి ఫూలే ధ్వంసం చేశారని గుర్తు చేశారు.

మహిళలు చేపల విక్రయ వ్యాపారం ద్వారా ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలన్నది ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం అని వెల్లడించారు. రూ. 10 లక్షల విలువైన వాహనాలను రూ. 6 లక్షల సబ్సిడీతో కేవలం రూ. 4 లక్షలకే లబ్ధిదారులకు అందజేస్తున్నామని తెలిపారు. పేద మహిళలను వ్యాపారాల్లో రాణించే కోటీశ్వరులుగా తయారు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. 17 రకాల వ్యాపారాలకు లోన్లు, భీమా పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు.
“మీ ఫిష్ ఫుడ్‌కి మంచి బ్రాండ్ క్రియేట్ చేయండి. 100% విజయవంతంగా మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లండి” అని సీతక్క ఆకాంక్షించారు.”అమ్మ చేతి వంటకు మారుపేరుగా ‘ఇందిరా మహిళా క్యాంటీన్’లు నిలవాలి” అని పిలుపునిచ్చారు. తాను కూడా ఒకప్పుడు రోడ్డు పక్కన చేపల విక్రయం చేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. నాణ్యమైన, రుచికరమైన, ఆరోగ్యకరమైన చేపల వంటకాలు తయారు చేసి లాభసాటి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని మహిళలకు సూచించారు.