రాష్ట్రంలో గురువారం నుంచి ఈ నెల 22వ తేది వరకు ఉరుములు, పిడుగులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈ మేరకు వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో వివరాలిలా ఉన్నాయి… తూర్పు గాలుల వేగంలో మార్పు కారణంగా దక్షిణ తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, ఉత్తర తమిళనాడు(Tamilnadu)లోని ఒకటి, రెండు ప్రాంతాలు, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో ఈనెల 22వ తేది వరకు మోస్తరు వర్షం కురువనుంది.
రాజధాని నగరం చెన్నై(Chennai)లో రానున్న 48 గంటల వరకు ఆకాశం మేఘావతంగా ఉంటూ, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముంది. అదే సమయంలో, తెల్లవారుజామున మంచు కురిసే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23-24 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది.


































