Monalisa:మొదటి సినిమా పై సైన్ చేసిన మోనాలిసా.. హీరో ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే?

ఉత్తర ప్రదేశ్‌(Uttar Pradesh)లోని ప్రయాగ్ రాజ్‌(Prayagraj)లో జరుగుతోన్న మహా కుంభమేళా(Mahakumbamela)కు ఎక్కడెక్కడి నుంచో భక్తులు(Devotees) భారీగా తరలి వచ్చారు.


ఈక్రమంలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కి చెందిన మోనాలిసా అనే అమ్మాయి తన కుటుంబంతో కలిసి పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకునేందుకు వచ్చింది. ఈ క్రమంలో ఆమె మహాకుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్‌గా(Special Atraction) నిలిచింది. అయితే కొందరు యూట్యూబర్లు ఆమె ఫొటోలు(Photos), వీడియో(Video)లు తీసి సోషల్ మీడియా(Social Media) వైరల్ చేశారు.

ఈ క్రమంలో మహాకుంభమేళాలో పూసలమ్మిన మోనాలిసా ఓవర్ నైట్ స్టార్‌గా ఎదిగిన విషయం తెలిసిందే. ఎక్కడ చూసినా ఆమె ఫొటోలు, వార్తలే దర్శనమిచ్చాయి. ఈ తరుణంలోనే మోనాలిసాకు సినిమా ఆఫర్లు అంటూ కూడా పలు వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ నేపథ్యంలో తన తర్వాతి మూవీలో అవకాశం ఇస్తానని బాలీవుడ్ డైరెక్టర్(Bollywood Director)సనోజ్ మిశ్రా(Sanoj Mishra) ప్రకటించారు. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం ఆయన మధ్యప్రదేశ్‌(Madya Pradesh)లోని ఇండోర్‌(Indoor)లోని ఖర్గోన్ జిల్లా మహేశ్వర్‌లోని మోనాలిసా(Monalisa) నివాసానికి వెళ్లారు. అక్కడ మోనాలిసా తండ్రికి సినిమా ఇండస్ట్రీ గురించి వివరించారు.

దీంతోపాటు ఆయనకు వస్తున్న పలు సందేహాలను కూడా డైరెక్టర్ క్లియర్ చేశారు. ఈ క్రమంలో ఎట్టకేలకు మోనాలిసా తండ్రి జై సింగ్ భోంస్లే(Jai Singh Bhosle) కూడా తన కుమార్తె సినిమాల్లో నటించేందుకు అనుమతించారు. ఈ తరుణంలో ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ చిత్రం(Movie)లో నటించేందుకు ఆమె నుంచి అంగీకార పత్రంలో సంతకం తీసుకున్నారు. సినిమా షూటింగ్‌కి ముందు ముంబై(Mumbai)లో యాక్టింగ్ ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నారు. ఇక మోనాలిసా ఏప్రిల్ నుంచి షూటింగ్ కు హాజరు కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల తీసుకువచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోన్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని డైరెక్టర్ సనోజ్ మిశ్రా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇందులో రాజ్‌కుమార్ రావు(Rajkumar Rao) సోదరుడు అమిత్ రావు(Amith Rao) నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట హాట్‌టాపిక్ గా మారింది.