Credit Cards: క్రెడిట్ కార్డు నుంచి బ్యాంక్ అకౌంట్‌కి మనీ ట్రాన్స్‌ఫర్ ఇలా ఈజీగా చేసుకోండి

క్రెడిట్ కార్డులు.. దాదాపు అన్ని ప్రైవేటు కంపెనీల ఉద్యోగులు తమ అవసరాన్ని బట్టి క్రెడిట్ కార్డులు(Credit Card) తీసుకుంటారు. క్రెడిట్ కార్డులను ప్రణాళిక బద్ధంగా వాడితే చాలా ఉపయోగపడతాయి.


అలా కాకుండా.. ఇష్టానుసారం వాడేసి.. సమయానికి తిరిగి కట్టకపోతే సిబిల్ స్కోర్ పడిపోయి.. బ్యాంకుల ద్వారా కలిగే కొన్ని ఆర్థిక లాభాలను కోల్పోతాం.

అత్యవసర సమయాల్లో క్రెడిట్ కార్డులు బాగా ఉపయోగపడతాయి. స్టేట్‌మెంట్ వచ్చాక సమయానికి బిల్ కట్టేస్తే సమస్యేమీ ఉండదు. కట్టకపోతే అప్పుల్లో కూరుకుపోతాం. అయితే ఈ కార్డులను తనాఖా పెట్టడం, స్టాక్స్ కొనడం వంటి పనులను చేయలేం. అలాంటి సందర్భంలో కార్డు నుంచి బ్యాంక్ అకౌంట్‌కి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు పేమెంట్స్‌ని అంగీకరించని చోట బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ ఉపయోగపడుతుంది. అయితే క్రెడిట్ కార్డు లిమిట్ ఎంతున్నా.. దాన్ని బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం తెలియక చాలా మంది సతమతమవుతుంటారు. క్రెడిట్ కార్డులో ఉన్న నగదుని నెట్ బ్యాంకింగ్ ఫీచర్ ద్వారా బ్యాంక్ అకౌంట్లోకి(Money Transfer from Credit Card to Bank Account) ఎలా మార్చుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

క్రెడిట్ కార్డు నుంచి బ్యాంక్ అకౌంట్‌కి..

మీ బ్యాంకుకి సంబంధించిన అఫిషియల్ వెబ్ సైట్‌లోకి లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లోకి వెళ్లండి

వెబ్ సైట్ లేదా యాప్‌లోకి లాగిన్ కావాలి.

క్రెడిట్ కార్డు సెక్షన్‌లోకి వెళ్లండి

ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్‌లోకి వెళ్లండి

ట్రాన్స్‌ఫర్ టు ది బ్యాంక్ అకౌంట్ అనే ట్యాబ్‌పై క్లిక్ చేయండి

బ్యాంకు వివరాలు, నగదు మొత్తాన్ని ఎంటర్ చేయండి

ట్రాన్స్‌ఫర్ రిక్వస్ట్‌ని నిర్ధారించండి. ఓటీపీని ఎంటర్ చేయండి

ట్రాన్సాక్షన్ నిర్ధారణ అవుతుంది. అప్పుడు రిఫరెన్స్ ఐడీ లేదా ట్రాన్సాక్షన్ ఐడీని ఓ చోట భద్రపరుచుకోండి.

నగదు బదిలీ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

క్రెడిట్ కార్డు నుంచి బ్యాంక్ అకౌంట్‌కి డబ్బులు పంపేటప్పుడు మీ క్రెడిట్ కార్డు లిమిట్ ఉండేలా చూసుకోండి.

ఫండ్ బదిలీలకు సంబంధించి రుసుములు, వడ్డీ రేట్లను గుర్తుంచుకోండి.

ట్రాన్స్‌ఫర్ చేస్తున్న నగదు మొత్తంపై క్రెడిట్ కార్డు కంపెనీలు 1 నుంచి 5 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తాయి

నగదు బదిలీ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. ట్రాన్సాక్షన్లకు నమ్మకమైన, భద్రత కలిగిన ప్లాట్‌ఫాంలను వినియోగించండి. క్రెడిట్ కార్డు సీవీవీ, పిన్, ఓటీపీ వంటివి ఎంటర్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి.