Monkey Cup Tree: ఆ మొక్క మాంసం లాగించేస్తుంది.. ఎలా తింటుందో తెలుసా?

Monkey Cup Tree: భూమిపై రెండు రకాల జీవరాశులు ఉంటాయి. ఒకటి శాకాహార జీవులు. రెండోది మాంసాహార జీవులు. మాంసాహార జీవులు అనగానే క్రూర మృగాలు గుర్తొస్తాయి.
మన ఇళ్లలో పెంచుకునే పిల్లులు, కుక్కలు కూడా మాంసాహార జంతువులే. ఇక శాకాహారం అంటే ఆవులు, మేకలు, గొర్రెలు లాంటి సాదు జంతువులు గుర్తుకు వస్తాయి. అయితే మొక్కలు భూమి నుంచి పోషకాలు, సూర్యుని నుంచి కాంతి తీసుకుని జీవిస్తాయి. వీటిపై ఆధారపడి సాదు జంతువులు ఉంటాయి. సాదు జంతువులపై క్రూర మృగాలు ఆధారపడతాయి. అయితే మొక్కల్లో కూడా రెండు మూడు రకాల మాంసాహార మొక్కలు ఉన్నాయి. అలాంటిదే ఈ మంకీ కంబ్‌. ఇది మాంసం తింటుంది. ఎలా తింటుందో చూద్దాం.


ప్రపంచలో భయంకరమైన మొక్క..
ప్రపంచంలో భయంకరమైన మొక్కల్లో మంకీ కప్ ఒకటి . ఈ మొక్క దాని మీద వాలడానికి వచ్చిన జీవులను తన లోపలికి లాక్కుని అరిగించుకుంటుంది. ఇక ఈ మొక్క మంచి రంగులో ఉండడమే కాదు మంచి సువాసనను కూడా వెదజల్లుతుంది. దీనికి జీవరాశులు ఆకర్షితమవుతాయి. మొక్కకు ఉన్న ట్రాక్‌లాంటి ఆకృతిపై చిన్నచిన్న క్రిములు కీటకాలు వాలుతుంటాయి. అది చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. అక్కడ వాలిన క్రిములు లోపలికి జారిపడతాయి. లోపల పడిన జీవరాశి బయటకు రావడం కష్టం.

ఎలుకలు, పాములు కూడా..
అప్పడప్పుడు మొక్క వద్దకు ఎలుకలు, పాములు వస్తుంటాయి. ఎలుకలు, పాములు క్రిమి కీటకాల కోసం మొక్క వద్దకు వస్తాయి. వాటిని తినే క్రమంలో మొక్కలోనికి జారిపడతాయి. పక్షులు మొక్కలోపల ఉన్న నీళ్లు తాగేందుకు వచ్చి లోపల పడతాయి. కోతులు కూడా పడిపోతాయి. ఇవన్నీ మొక్కకు మంచి న్యూట్రిషన్‌లాగా పనిచేస్తాయి.