Moodham: మూఢం అంటే ఏంటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు నిర్వహించరు?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

Moodham: వివాహాది శుభ కార్యాలు చేసుకోవడానికి ఇంక కొన్ని రోజులు మాత్రమే మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఈ ఏడాది ఏయే సమయాల్లో మూఢం వచ్చింది? ఎన్ని రోజులు ఉన్నాయనే విషయాల గురించి పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా వివరించారు.

Moodham: నవగ్రహాలకు అధిపతి రవి. ఈ సూర్యగ్రహం చుట్టూ మిగతా గ్రహములన్నీ తిరుగుతాయి. అందువల్ల సూర్యుడికి నవగ్రహ నాయకత్వం లభించినది. ఇలాంటి నవగ్రహ నాయకుడైనటువంటి సూర్యునితో శుభగ్రహాలైనటువంటి బృహస్పతి కానీ, శుక్రుడు కానీ కలసి ఒకే రాశిలో ఉన్న సమయాన్ని మౌఢ్యము లేదా మూఢము అని అంటారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

రవి గురునితో కలసి ఉన్నట్లయితే దానికి గురు మూఢమని, రవి గనుక శుక్రునితో కలసి ఒకే రాశిలో ఉంటే దానిని శుక్రమూఢమని అంటారని చిలకమర్తి తెలిపారు. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం గురు మూఢము, శుక్రమూఢము కాని ఏర్పడిన సమయములలో శుభకార్యాలను ఆచరించినట్లయితే ఆ కార్యాలు శుభఫలితాలు ఇవ్వవని అలా చేసుకున్నటువంటి కార్యక్రమాల వలన జీవితంలో సమస్యలు ఇబ్బందులు పెరుగుతాయని అందుకే ఈ సమయాలలో శుభకార్యాలను నిషేధించారని చిలకమర్తి తెలిపారు.

Related News

మూఢంలో ఏం చేయకూడదు?
మౌఢ్య దినాలలో వివాహము, ఉపనయనము, గర్భాదానము, గృహారంభం, గృహ ప్రవేశం, వాస్తు సంబంధిత కార్యక్రమాలు వంటివి చేయరు. శంఖుస్థాపన, నూతన ఆరంభము వంటి కార్యక్రమాలను ఆచరించకూడదని చిలకమర్తి తెలిపారు. నిత్య దైవిక కార్యక్రమాలు, పితృదేవత కార్యక్రమాలు, అబ్బికాలు, పిండప్రధానాలు, సంవత్సరీకాలు, పుంసవనం, శ్రీమంతం వంటి కార్యక్రమాలు, నామకరణం వంటి కార్యక్రమాలు యథావిధిగా ఆచరించుకోవచ్చు.

ఉపనయనాది, వివాహం వంటి శుభకార్యాలు మాత్రం ఆచరించకూడదు. మౌఢ్య సమయంలో వివాహాది శుభరార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు/ పనులు (తాంబూలాలు మార్చుకోవడం, వినాయకునికి మీదు కట్టడం, పసుపు కొట్టడం వంటివి) కూడా ఆచరించరాదు. 2024 సంవత్సరంలో 29 మార్చి 2024 నుండి శుక్రమూఢము ప్రారంభమైనదని ఈ సంవత్సరం జూన్‌, జూలై వరకు కూడా శుక్రమూఢము, గురుమూఢము ఫలితంగా ముహూర్తాలు లేవని పంచాంగకర్త చిలకమర్తి తెలిపారు.

చిలకమర్తి పంచాంగరీత్యా ధృక్ సిద్ధాంతం గణితం ఆధారంగా శ్రీ క్రోధినామ సంవత్సరంలో గురు, శుక్రమూఢముల వలన చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసాలలో ముహూర్తములు పనికిరావు.

గురు మూఢం

14-4-2024 నుండి 1-5-2024 వరకు,

15-5-2024 నుండి 14-6-2024 వరకు

శుక్ర మూఢము
9-4-2024 నుండి 14-4-2024 వరకు,

24-4-2024 నుండి 14-5-2024 వరకు

19-5-2024 నుండి 6-7-2024 వరకు,

16-7-2024 నుండి 31-7-2024 వరకు,

16-8-2024 నుండి 24-8-2024 వరకు,

16-9-2024 నుండి 18-9-2024 వరకు

14-8-2025 నుండి 29-03-2025 వరకు ఉన్నాయి.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *