MOTOROLA Edge 60 Fusion 5G స్మార్ట్ ఫోన్ భారీ ఆఫర్స్ తో రేపు మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి రానున్నది. ఈ మొదటి సేల్ నుంచి ఈ ఫోన్ బెస్ట్ డీల్స్ తో మంచి ఆఫర్ ధరకు అందుకోవచ్చు. ఈ మోటోరోలా కొత్త స్మార్ట్ ఫోన్ సేల్ కంటే ముందే ఈ ఫోన్ ధర, ఫీచర్లు మరియు ఆఫర్స్ పూర్తిగా తెలుసుకోండి.
MOTOROLA Edge 60 Fusion 5G : ప్రైస్ మరియు ఆఫర్లు
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ బేసిక్ (8GB + 256GB) వేరియంట్ ను రూ. 22,999 ధరతో అందించింది. ఈ ఫోన్ హై ఎండ్ (12GB + 256GB) వేరియంట్ ను రూ. 24,999 ధరతో అందించింది. ఈ ఫోన్ పై గొప్ప లాంచ్ ఆఫర్స్ కూడా అందించింది.
ఈ ఫోన్ ను Axis మరియు IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 2,000 భారీ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ మోటోరోలా కొత్త స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 20,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది.
MOTOROLA Edge 60 Fusion 5G : ఫీచర్లు
ఈ మోటోరోలా కొత్త స్మార్ట్ ఫోన్ 6.67 ఇంచ్ ఆల్ కర్వుడ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7400 5G చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 12GB ఫిజికల్ ర్యామ్, వర్చువల్ ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్ ఫోన్ లో వెనుక 50MP Sony LYTIA 700C + 13MP + 3-in-1 లైట్ సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా మరియు 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ 4K Video రికార్డ్ సపోర్ట్, moto Ai ఫీచర్ తో Ai కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 3D సిలికాన్ వేగాన్ లెథర్, గొరిల్లా గ్లాస్ 7i రక్షణ మరియు MIL STD-810H వంటి ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5జి స్మార్ట్ ఫోన్ 5500 mAh బిగ్ బ్యాటరీ మరియు 68 W టర్బో పవర్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ లో Hi-Res Audio మరియు Dolby Atmos సౌండ్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్పీకర్లు ఉన్నాయి. ఈ ఫోన్ నీటి నుంచి పూర్తి రక్షణ అందించే IP68 + IP69 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది.