మన హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతినెల పౌర్ణమి అమావాస్య వంటివి వస్తూనే ఉంటాయి. ఇలా ప్రతినెల అమావాస్య వస్తున్నప్పటికీ మాఘమాసంలో వచ్చే అమావాస్య ఎంతో ప్రత్యేకమైనదని పవిత్రమైనదని చెప్పవచ్చు.
మరి మాఘ మాసంలో వచ్చే ఈ అమావాస్యను మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ మౌని అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంది.. మరి రేపు రాబోయే మౌని అమావాస్య రోజు మనం ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయానికి వస్తే …
చేయకూడని పనులు…
మౌని అమావాస్య రోజు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు అలాంటి వాటిలో ఉదయం నిద్ర లేవడం అనేది కూడా ఒకటి పొరపాటున కూడా అమావాస్య రోజు ఎవరు కూడా ఆలస్యంగా నిద్రలేకూడదు ఇలా నిద్రలేయటం దరిద్రంగా పరిగణించబడుతుంది అందుకే సూర్యోదయాన్ని కంటే ముందుగానే నిద్రలేచి స్నానం ఆచరించి సూర్య దేవుడికి అర్ఘ్యం ఇవ్వాలి.
మౌని అమావాస్య అంటే మౌనమని అర్థం అందుకే ఈరోజు మౌనవ్రతం పాటించడం ఎంతో మంచిది అలాగే ఈరోజు ఎవరిని కూడా దురుసుగా దూషించకూడదు.
ఇక ఈ అమావాస్య రోజు ఉదయం స్నానం చేసి తల్లిదండ్రులేని వారు వారి పితృదేవతలకు తర్పణాలు పెట్టడం ఎంతో మంచిది. ఇక ఈ మౌని అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్ర అసలు చేయకూడదు అలాగే రాత్రి పడుకునేటప్పుడు భోజనం చేయకుండా నిద్రపోవట మంచిది.
ఇక అమావాస్య రోజు తలస్నానం చేయొచ్చు కానీ తలంటు పోసుకోకూడదు అలాగే తలకు నూనె కూడా రాయకూడదు. ఇక ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా జుట్టు కత్తిరించడం గడ్డం తీయడం గోర్లు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు. ఇలాంటి పనులు చేస్తే అష్ట దరిద్రాలు మనల్ని వెంటాడుతాయి.
ఈ అమావాస్య రోజు సాయంత్రం పసి పిల్లలను బయటకు తీసుకొని రాకూడదు అలాగే అమావాస్య రోజు మాంసాహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.
చేయాల్సిన పనులు….
మౌని అమావాస్య రోజు ఉదయమే నిద్రలేచి నదీ స్నానాలను ఆచరించడం ఎంతో మంచిది. ఇలా నది స్నానాలు ఆచరించిన తర్వాత సూర్య నమస్కారాలు అలాగే పితృదేవతలను కూడా పూజించడం ఎంతో మంచిది.
పితృ దోషాలతో బాధపడేవారు ఈ మౌని అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణం వదిలి నమస్కరించట వల్ల పితృ దోషాలు తొలగిపోతాయి. ఇకపోతే ఈ అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం కూడా ఎంతో శుభప్రదంగా పరిగణింపబడుతుంది.
చొల్లంగి అమావాస్య రోజున పిండిలో పంచదార కలిపి దానిని చీమలకు ఆహారంగా అందించండి. ఇలా చేయడం వలన పితృ దోషాలు తొలగిపోవడం కాకుండా వారి ఆశీస్సులతో కోరిన కోరికలు నెరవేరుతాయి.
ఇక పితృ సమస్యలు దోషాలతో బాధపడేవారు అమావాస్య రోజున నలుపు రంగు దుప్పట్లను అలాగే
నల్ల నువ్వుల లడ్డులు నువ్వుల నూనె, ఉసిరికాయలు, నల్లని వస్త్రాలను పేదవారికి దానం చేయటం వల్ల ఎలాంటి దోషాలు ఉండవు.
ఇక ఈ అమావాస్య రోజు మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనం చేయకపోవడం ఎంతో మంచిది అలాగే ఈ అమావాస్య లక్ష్మీదేవి పూజకు కూడా ఎంతో శుభప్రదంగా పరిగణిస్తారు.