ముక్కోటి ఏకాదశి హిందువులకు చాలా పవిత్రమైన రోజు. ఆ రోజు ( జనవరి 10) ఉపవాసం ఉండి.. లక్ష్మీదేవిని.. విష్ణుమూర్తిని పూజిస్తే సిరి సంపదలతో పాటు మోక్షం కూడా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
ఇంకా వైకుంఠ ఏకాదశి… ముక్కోటి ఏకాదశి రోజున కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటే.. జీవితం అనంతరం స్వర్గలోకానికి వెళతారని.. ఇక మరల జన్మ ఉండదని పండితులు చెబుతున్నారు.
ఏకాదశి అంటేనే విష్ణు సంబంధ ఆలయాలు కిటకిటలాడతాయి. ఇక ముక్కోటి ఏకాదశి.. వైకుంఠ ఏకాదశికి ఉండే విశిష్టత అంతా ఇంతా కాదు. ఆ రోజున ( జనవరి 10) విష్ణుమూర్తితో పాటు ముక్కోటి దేవతలు భూలోకంలో సంచరిస్తారని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. ఆ రోజున రాక్షస సంహారి విష్ణుమూర్తి దంపతులను పూజిస్తే ..కష్టాలు తొలిగి.. సిరి సంపదలతో పాటు .. మరణానంతరం .. మోక్షం లభిస్తుందని హిందువులు విశ్వశిస్తుంటారు. ఈ రోజున ఉపవాసం పాటించడం ద్వారా విష్ణువు అనుగ్రహం పొంది జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు పొందుతారు.
ముక్కోటి ఏకాదశి ( జనవరి 10)న ఉపవాసం ఉండి .. లక్ష్మీదేవిని.. విష్ణుమూర్తిని పూజిస్తే పాపాలు నశిస్తాయి. ముక్కోటి ఏకాదశి రోజున పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం..
బ్రహ్మ ముహూర్తంలో మేల్కొనాలి: వైకుంఠ ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి.
పూజ స్థలం అలంకారం: పూజ స్థలాన్ని శుభ్రం చేసి పువ్వులు.. దీపాలతో అలంకరించండి.
విష్ణువు విగ్రహం: పీఠం ఏర్పాటు చేసి దాని మీద ఎర్రటి వస్త్రాన్ని పరచి.. అప్పుడు విష్ణుమూర్తి విగ్రహం లేదా విష్ణువు చిత్రాన్ని పెట్టండి.
అభిషేకం: విష్ణువుకు గంగాజలంతో స్నానం చేయించి, పూవ్వులు, గంధం, పసుపు, కుంకుమ మొదలైన వాటిని సమర్పించండి.
ఆరాధన: విష్ణువుకి సంబంధించిన వివిధ మంత్రాలను జపించండి. లక్ష్మి విశ్నువులను స్తుతించండి.
నైవేద్యము: విష్ణువుకి నైవేధ్యంగా అరటి పండ్లు, కొబ్బరి కాయతో పాటు పండ్లు, స్వీట్లు లేదా పాలతో చేసిన ఇతర భోగాలను అందించవచ్చు.
హారతి: చివరగా విష్ణువుని స్తుతిస్తూ హారతి ఇవ్వండి.
ఉపవాసం పాటించడం: రోజంతా నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండండి. కఠిన ఉపవాసం పాటించడం సాధ్యం కాకపోతే.. పండ్లను తినవచ్చు.
దానధర్మం: ఈ రోజున దానధర్మాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది.
ఈ రోజున మంత్ర జపం: ‘ఓం నమో నారాయణాయ’, ‘ఓం విష్ణువే నమః’ వంటి విష్ణువు మంత్రాలను జపించండి.
కథ వినండి: వైకుంఠ ఏకాదశి కథ వినండి.
సాత్విక ఆహారం: ఏకాదశి పరణ అంటే ఉపవాసం విడిచే సమయంలో సాత్విక ఆహారం తినండి.
వైకుంఠ ఏకాదశి రోజున ఏమి చేయకూడదంటే
ప్రతికూల ఆలోచనలు: ఈ రోజు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి.
అబద్ధం: ఈ రోజున పొరపాటున కూడా అబద్దాలు చెప్పవద్దు
కోపం తెచ్చుకోవద్దు: కోపం తెచ్చుకోవద్దు.. మహిళలను దూషించవద్దు
మాంసాహారం: మాంసాహారానికి దూరంగా ఉండండి.
ఉల్లిపాయ, వెల్లుల్లి: ఉల్లిపాయ, వెల్లుల్లి తినవద్దు.