సల్లూ భాయ్ మళ్లీ అదరగొట్టాడు.. మురుగదాస్‌ ‘సికందర్’ టీజర్ చూశారా?

www.mannamweb.com


బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ‘సికందర్’ టీజర్ కాసేపటి క్రితమే విడుదలైంది. ఈ టీజర్ శుక్రవారమే రిలీజ్ కావాల్సింది. అయితే మన్మోహన్ సింగ్ మరణం కారణంగా విడుదల వాయిదా పడింది. ఇప్పుడు విడుదలైన 1:41 నిమిషాల టీజర్‌లో సల్లూ భాయ్ అదరగొట్టాడు.

ప్రముఖ తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటిస్తోన్న సినిమా సికందర్. సల్లూ భాయ్ స్నేహితుడు సాజిద్ నదియావాలా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2025 రంజాన్‌ కానుకగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. సుమారు 1:41 నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్ లో సల్లూ భాయ్ మరోసారి అదరగొట్టాడు. టీజర్‌లో ఓ చిన్న యాక్షన్ సన్నివేశాన్ని చూపించారు. యానిమల్ మూవీ తరహాలో ఇందులో భారీ యాక్షన్ సీక్వెన్స్ కు బాగా ప్రాధాన్యమిచ్చినట్లు తెలుస్తోంది. సికందర్ సినిమా యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఉండబోతోందని టీజర్‌లో చూపించారు. టీజర్‌లో చాలా తుపాకులు, గ్యాంగుల ముఠాలు మనకు కనిపిస్తాయి. మురుగదాస్ గతంలో ‘గజిని’, ‘ఎళవం అరివు’, ‘స్టాలిన్’, ‘తుపాకి’, ‘కత్తి’, ‘స్పైడర్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇక హిందీలో అమీర్ ఖాన్ తో ‘గజినీ’, అక్షయ్ కుమార్ తో ‘హాలిడే’, సోనాక్షి సిన్హాతో ‘అకీరా’, సల్మాన్ ఖాన్ తో ‘జై హో’ చిత్రాలను తెరకెక్కించారు. ఇక సల్మాన్‌ఖాన్‌తో మురుగదాస్‌ జత కట్టడం ఇది రెండో సారి. అయితే ఈ యాక్షన్ టీజర్‌లో సల్మాన్ ఖాన్ మినహా దర్శకుడు ఇతర నటీనటులు కనిపించలేదు.

సల్మాన్ ఖాన్ నటించిన ‘రాధే’, ‘ఆంతీమ్’, ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’, ‘టైగర్ 3′ సినిమాలు ఫర్వాలేదనిపించాయి. అయితే సల్మాన్ రేంజ్ కు ఇవి సరిపోలేదు. దీంతో ‘సికందర్’ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. టీజర్‌లో పేర్కొన్నట్లుగా, ఈ చిత్రం 2025 ఈద్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రష్మిక మందన్నతో పాటు కాజల్ అగర్వాల్ కూడా నటిస్తోంది. ఇటీవల విడుదలైన బేబీ జాన్’ సినిమాలోనూ సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు.