బిగ్ బాస్ హౌస్ లోకి కొత్త కంటెస్టెంట్స్ వచ్చారు. బిగ్‌బాస్ ‘రీలోడ్’ పేరుతో జరిగిన వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఆకట్టుకున్నాయి. కాకపోతే ముందుగా ఊహించిన వారే హౌస్ లోకి రావడంతో పెద్దగా కిక్ ఇవ్వలేదు.
సీజన్ 8 సందర్భంగా 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. హౌస్ లోకి ముందుగా హరితేజ ఎంట్రీ ఇచ్చింది. హరితేజ కోసం నవదీప్ ఓ వీడియో చేశాడు. ఆతర్వాత టేస్టీ తేజ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తేజ కోసం శోభాశెట్టి వీడియో ద్వారా ఆల్ ది బెస్ట్ చెప్పింది. అలాగే నయని పావని కూడా హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఆమెకోసం శివాజీ ఓ వీడియో చేశారు. అలాగే మెహబూబ్ కూడా హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. అతని కోసం సోహెల్ వీడియో ద్వారా ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఆతర్వాత గంగవ్వ, ముక్కు అవినాష్, రోహిణి, గౌతమ్ కూడా హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు.
హౌస్ లోకి కొత్త కంటెస్టెంట్స్ ఎంటర్ అవ్వడంతో పాటు కొంతమంది సెలబ్రెటీలు కూడా బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చి సందడి చేశారు. అలాగే హీరో సుధీర్ బాబు, షాయాజీ షిండే కూడా బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశారు. మా నాన్న సూపర్ హీరో అనే ప్రమోషన్స్ లో భాగంగా ఈ ఇద్దరు బిగ్ బాస్ కు సెలబ్రెటీ గెస్ట్ లుగా హాజరయ్యారు. కాగా ఈ స్టేజ్ పై షాయాజీ షిండే ను పొగడ్తలతో ముంచెత్తారు హీరో సుదీర్ బాబు. ఆయన ఎక్కడైనా ఖాళీ స్థలాలు కనిపిస్తే అక్కడ మొక్కలు నాటుతుంటారు అని చెప్పాడు.
దీని గురించి షాయాజీ షిండే మాట్లాడుతూ.. నాదగ్గర ఇంత డబ్బువుంది. కానీ మా అమ్మను బతికించుకోలేకపోయాను. అప్పుడే నేను మా అమ్మ బరువుకు సమానమైన విత్తనాలు తీసుకొచ్చి ఇండియా మొత్తం నాటాలని ఫిక్స్ అయ్యాను. అవి పెరిగి పూలు, పండ్లు ఇస్తాయి. వాటిని చూస్తుంటే మా అమ్మ గుర్తొస్తుంది అని చెప్పారు షాయాజీ షిండే. మాములుగా మనం గుడికి వెళ్తే మనకు ప్రసాదం ఇస్తారు. ప్రసాదంతో పాటు ఓ మొక్క కూడా ఇస్తే బాగుంటుంది. నేను మహారాష్ట్రలో ఆల్రెడీ మూడు ఆలయాల్లో ఇది మొదలు పెట్టాను. అందరికి కాకపోయినా అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేయించే వాళ్లకు ఇస్తారు. ఇక్కడ కూడా అది ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటున్నాను. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ దొరికితే ఆయన్ను కలిసి ఈ వివరాలు చెప్తాను. దేవుడు ప్రసాదంతో పాటు మొక్కలు కూడా పంచాలి. అవి తర్వాత జన్మలకు కూడా ఉంటాయి అని షాయాజీ తెలిపారు.