రాష్ట్రం(Andhra Pradesh)లో ఇటీవల 5 ఎమ్మెల్సీ(MLC) స్థానాలకు కూటమి పార్టీల నుంచి ఐదుగురు ఎమ్మెల్సీలను ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. కూటమి తరఫున నామినేషన్ వేసిన ఐదుగురు అభ్యర్థులు ఎన్నికయ్యారు. వీరిలో టీడీపీకి చెందిన కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, బీద రవిచంద్రతో పాటు బీజేపీ అభ్యర్ధి సోము వీర్రాజు, జనసేన అభ్యర్థి కొణిదెల నాగబాబు ఎన్నికయ్యారు.
ఈ నేపథ్యంలో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యే కోటాలో కొణిదెల నాగబాబు(Konidela Nagababu) నూతన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నాగబాబు సోదరుడు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) స్పందించారు. ఈ క్రమంలో నాగబాబుకు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ”ఎమ్మెల్సీగా ఎన్నికయి ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తొలి సారి అడుగు పెట్టబోతున్న నా తమ్ముడు నాగేంద్రబాబుకు అభినందనలు, ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని తెలిపారు. ఈ క్రమంలో ప్రజా సమస్యల మీద గళం విప్పుతూ అభివృద్ధికి పాటుపడేలా కృషి చేయాలి. మరింత ప్రజాభిమానాన్ని చూరగొనాలి” అని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.