రైల్వే వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రధాని నరేంద్ర మోడి దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను అందుబాదుటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రావడంతో.. ప్రజలకు ప్రయాణం మరింత సులభంగా మారింది. అంతేకాకుండా.. ఈ వందే భారత్ రైళ్లకు మంచి ఆదరణ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలోనే దేశంలోని ప్రధాన నగరాల మధ్య ఈ వందే భారత్ రైళ్లు పట్టాలపై పరుగులు పెడుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ రైల్వే వవ్యస్థను మరింత మెరుగు పరిచేందుకు ప్రధాని నరేంద్ర మోడి కొత్తగా దేశంలో మొట్ట మొదటిసారిగా వందేభారత్ మెట్రో రైలు సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. పైగా ఈ మెట్రో రైలు నేడు పట్టాలపై పరుగులు పెట్టనుందని ఇది వరకే ప్రకటించారు. కానీ, తాజాగా ఈ వందే భారత్ మెట్రో రైలు ప్రారంభోత్సవానికి కొన్ని గంటల ముందే దీని పేరు మార్చి ప్రారంభించడం జరిగింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..
దేశంలో మొట్ట మొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా వందేభారత్ మెట్రో రైలును నేడు ( సెప్టెంబర్ 16న) గుజరాత్‌లోని భుజ్ – అహ్మదాబాద్ మధ్య నడిచేందుకు గ్రాండ్ గా లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రైలు ప్రారంభానికి కొన్ని గంట ముందే ప్రధాని దీనికి పేరు మార్చారు. కాగా, ఇప్పుడు ఈ రైలు పేరు.. నమో భారత్ ర్యాపిడ్ రైల్ గా పేరు మార్చబడింది. ఇక ఈ విషయాన్ని తాజాగా రైల్వే అధికార ప్రతినిధి నేడు వెల్లడించారు. ఇకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రం సాయంత్రం 4:15 గంటలకు నమో భారత్ ర్యాపిడ్ రైల్‌ను జెండా ఊపి ప్రారంభించారు.
ఇదిలా ఉంటే.. ఈ రైలు భుజ్ నుంచి అహ్మదాబాద్ వరకు 359 కి.మీ దూరాన్ని 5:45 గంటల్లో చేరుకుంటుంది. కాగా, ఆ సమయంలో రైలు తొమ్మిది స్టేషన్లలో ఆగుతుంది. ఇక ఈ ర్యాపిడ్ రైల్ లక్ష్యం ఇంటర్‌సిటీ కనెక్టివిటీని పెంచడం. అయితే సామాన్య ప్రజలు ఈ రైలు సేవలను సెప్టెంబర్ 17 అహ్మదాబాద్ నుంచి పొందగలరు. అలాగే ఈ రైలు ప్రయాణానికి అయ్యే టికెట్ ధర కేవలం రూ.455 మాత్రమే. ఇకపోతే వందే మెట్రో రైలు పేరును నమో భారత్ ర్యాపిడ్ రైల్‌గా మార్చాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు రైల్వే ప్రతినిధి తెలిపారు.
ఇక ఈ ర్యాపిడ్ రైల్ లో అనేక కొత్త సాంకేతికతలతో అమర్చి అందుబాటులోకి తీసుకొచ్చారు. పైగా ఇందులో మొత్తం 12 కోచ్‌లు, 1150 మంది ప్రయాణికుల సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. ముఖ్యంగా ర్యాపిడ్ రైల్ ఇతర మెట్రోలకు భిన్నంగా ఉంటుంది. ఈ సేవ నగరాల మధ్య వేగంగా ప్రయాణించే సౌకర్యాన్ని అందిస్తుందని రైల్వే శాఖ తెలిపింది.