Nara Lokesh: మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేశ్‌

www.mannamweb.com


నారా లోకేశ్‌ ఐటీ, విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

అమరావతి: నారా లోకేశ్‌ ఐటీ, విద్యా, ఆర్టీజీ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సచివాలయం నాలుగో బ్లాక్‌ రూమ్‌ నంబర్‌ 208లోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు.

పలు దస్త్రాలను ఆయన పరిశీలించారు. అంతకు ముందు సచివాలయానికి చేరుకున్న లోకేశ్‌కు పండితులు వేదమంత్రోచ్ఛరణలతో స్వాగతం పలికారు.

అమరావతి: మంత్రిగా నారా లోకేశ్‌ ఐటీ, విద్యా, ఆర్టీజీ శాఖల బాధ్యతలు చేపట్టారు. సచివాలయం నాలుగో బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. పలు దస్త్రాలను ఆయన పరిశీలించారు. మెగా డీఎస్సీ సంబంధిత దస్త్రంపైనే లోకేశ్‌ తొలి సంతకం చేశారు. 16,347 పోస్టుల భర్తీకి విధివిధానాలను క్యాబినెట్‌ ముందు పెట్టే ఫైల్‌పై ఆయన సంతకం పెట్టారు. అంతకు ముందు సచివాలయానికి చేరుకున్న మంత్రికి పండితులు వేదమంత్రోచ్ఛరణలతో స్వాగతం పలికారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం లోకేశ్‌కు సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, తెదేపా నేతలు అభినందనలు తెలిపారు. మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి, సవిత, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్‌, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు చెప్పారు.