స్త్రీని ఆదిశక్తిగా, చదువుల తల్లిగా, అన్నపూర్ణగా పేర్కొనే భారతీయ సంస్కృతికి భిన్నంగా ఆమె శక్తిహీనురాలిగా, నిస్సహాయురాలిగా అణిగిమణిగి సర్దుకు పోయే జీవితం గడపవలసిన దుర్భర పరిస్థితి కొనసాగుతోంది.
ఈ వివక్ష పుట్టుకతోనే ఆరంభమవుతుంది. వివక్ష, హింస, లైంగిక వేధింపులు, సరైన విద్య, వైద్య సదుపాయాలు అందుకోలేకపోవడం వంటి సవాళ్లు-ఇబ్బందు లను బాలికలు ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు. ఇటువంటి సమాజంలో ఉన్న బాలికలకు సాధికారత కల్పించడం, వారిని రక్షించడం ప్రధాన అంశాలుగా జాతీయ బాలికా దినోత్సవాన్ని 2008 నుంచి మన దేశంలో జరుపుతున్నారు.
బాలికల స్థితిని మెరుగుపరచడంలో దేశం పురో గతి సాధించిన మాట నిజమే. కాని, అది తగినంత కాదు. ఇప్పటికీ విద్య, పోషకాహారం, ఆరోగ్యం వంటి రంగాలలో అసమానతలు కొనసాగుతున్నాయి. భారత ప్రభుత్వం కొన్ని నిర్దిష్ట లక్ష్యాలను సాధించే విధంగా జాతీయ బాలికా దినోత్సవ సందర్భాన్ని వినియోగిస్తోంది. లింగ వివక్షకు సంబంధించిన సమస్యలపై పని చేయడం, బాలికల ఆరోగ్యం, పోష కాహారం, లింగ నిష్పత్తి అంతరాన్ని తగ్గించడం వంటి ముఖ్యమైన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడం; అవకాశాల పరంగా అసమానతలను తొల గించడం; ఆడపిల్లలందరికీ వారి హక్కులు, అర్హమైన గౌరవం, విలువలు లభి స్తాయని నిర్ధారించడం; కొత్త అవకాశాలను అందించడం, ఎదగడానికి వీలు కల్పించడం వంటివి ఈ లక్ష్యాలు. ‘బేటీ బచావో బేటీ పఢావో’, ‘సుకన్య సమృద్ధి యోజన’, ‘బాలికాసమృద్ధి యోజన, ‘లాడ్లీ’ పథకం, మాధ్యమిక విద్య కోసం బాలికలకు జాతీయ ప్రోత్సాహకాల వంటి పథకాలను ప్రభుత్వాలు ఎన్ని తీసు కొస్తున్నా… ఆడపిల్లలు తగినంతగా అభివృద్ధి చెందకపోవడం వెనుక ఉన్న కారణాలను అన్వేషించాలి.