IRCTC తత్కాల్ టికెట్ త్వరగా బుక్ చేయాలా. వెంటనే ఇలా చేయండి!

అనుకోకుండా ఎక్కడికైనా ప్రయాణం పడినప్పుడు లేదా టికెట్ బుకింగ్ లిస్టులో ఉన్న సమయంలో కొన్నిసార్లు టికెట్ బుక్ ఎంతో ఇబ్బంది పడుతుంటాము ఈ క్రమంలోనే ఎంతో త్వరగా సౌకర్యవంతంగా మన టికెట్ రిజర్వేషన్ చేసుకొని ప్రయాణం చేయాలంటే తత్కాల్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
తత్కాల్లో టికెట్ బుకింగ్ ఓపెన్ కాగానే వెంటనే బుక్ అవుతాయి ఇలాంటి సమయంలో అంత సులభంగా టికెట్లు దొరకడం కష్టతరం అవుతుంది. అయితే తత్కాల్లో కూడా వెంటనే టికెట్ బుక్ చేసుకోవాలంటే ఈ చిన్న పనిచేస్తే చాలు.


ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకునే వ్యక్తులు ఆధార్‌ నంబర్‌తో సహా అన్ని వివరాలను సమర్పించాల్సి ఉంటుంది అయితే ఈ వివరాలన్నింటినీ నమోదు చేసే లోపు మొత్తం సీట్లు అన్ని నిండిపోతాయి. ఇలాంటి సమయంలో మీరు తత్కాల్ టికెట్ బుక్ చేసుకోలేరు. తత్కాల్ లో టికెట్ బుక్ చేసుకోవాలంటే భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం మాస్టర్ లిస్ట్ ఫీచర్ సౌకర్యాన్ని అందిస్తుంది. అంటే ముందుగానే కొన్ని వివరాలు సేవ్‌ చేసుకోవడం అన్నట్లు. ముందుగానే మన వివరాలన్నింటినీ సేవ్ చేసి పెట్టుకోనే సౌకర్యాన్ని ఈ మాస్టర్ లిస్ట్ కల్పిస్తుంది.
ఈ విధంగా మీ వివరాలన్నింటినీ సేవ్ చేసిన తర్వాత
తత్కాల్ బుకింగ్ చేసినప్పుడు మీరు ఈ వివరాలను పూరించవలసిన అవసరం లేదు. యాడ్ ప్యాసింజర్స్‌పై క్లిక్ చేయడం ద్వారా అన్ని వివరాలు జోడించబడతాయి.
ఈ ఫీచర్‌ను ఉపయోగించడానికి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌కి వెళ్లి, మై అకౌంట్‌ Myprofileని ఎంచుకోండి. దీని తర్వాత జోడించు / సవరించు మాస్టర్ జాబితా ఆప్షన్‌ను ఎంచుకోండి. అనంతరం ప్రయాణీకుల వివరాలను పూరించి సమర్పించండి. దీని తర్వాత, బుకింగ్ చేస్తున్నప్పుడు, సేవ్‌ చేసిన ప్రయాణికుల జాబితా నుండి జోడించడం ద్వారా మీ బుకింగ్ సులభంగా చేయబడుతుంది.